ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంచి క్రేజ్ ఉన్న యువనాయకులు చాలామందే ఉన్నారు. అటు అధికార వైసీపీలో, ఇటు ప్రతిపక్ష టీడీపీలో పవర్‌ఫుల్ లీడర్లు ఉన్నారు. తమ పార్టీకి అండగా ఉంటూ, ప్రత్యర్ధి పార్టీలకు చుక్కలు చూపించే నాయకులకు కొదవ లేదు. అలా రాష్ట్రంలో మంచి క్రేజ్ నాయకుల్లో కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒకరు. దివంగత ఎర్రన్నాయుడు తనయుడుగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్, 2014 ఎన్నికల్లో తొలిసారి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

ఇక ఎంపీగా గెలిచాక పార్లమెంట్‌లో రామ్మోహన్ ఏ విధంగా సత్తా చాటారో అందరికీ తెలిసిందే. వేరే పార్టీ నేతలనీ సైతం ఆకట్టుకునేలా రామ్మోహన్ రాజకీయం నడిచింది. అలాగే పార్లమెంట్‌లో సైతం తనదైన శైలిలో మాట్లాడి అందరినీ మెప్పించారు. ఇంతలా క్రేజ్ తెచ్చుకున్నారు కాబట్టే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ గాలి ఉన్నా సరే రామ్మోహన్ మరోసారి టీడీపీ నుంచి విజయం సాధించారు.

రెండో సారి ఎంపీగా గెలిచాక కూడా రామ్మోహన్ దూకుడుగానే ఉంటున్నారు. పార్లమెంట్‌లో మంచి స్పీచ్‌లతో అదరగొట్టారు.  వైసీపీ తరుపున 22 మంది ఎంపీలు ఉన్నా సరే, రామ్మోహన్‌కు సరితూగే నాయకుడు లేడనే చెప్పొచ్చు. రామ్మోహన్‌లాగా లోక్‌సభలో వైసీపీ నుంచి మాట్లాడే నాయకులు లేరు. ఇలా ఢిల్లీ స్థాయిలో సత్తా చాటుతున్న రామ్మోహన్‌ని స్టేట్ పాలిటిక్స్‌లో తీసుకొస్తే బాగుంటుందని పలువురు టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు.

ఇప్పటికే రామ్మోహన్ బాబాయ్ అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడుగా సత్తా చాటుతున్నారు. అలాగే అధికార వైసీపీపై దూకుడుగానే వెళుతున్నారు. రామ్మోహన్ కూడా రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే టీడీపీకి మరింత అండ దొరుకుతుందని భావిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో రామ్మోహన్‌ని ఏదైనా అసెంబ్లీ సీటులో పోటీ చేయిస్తే బాగుంటుందని, ఎమ్మెల్యేగా రామ్మోహన్ సులువుగా విజయం సాధిస్తారని, అప్పుడు ప్రత్యర్ధి పార్టీగా ఉన్న వైసీపీకి చెక్ పెట్టడంలో ముందుంటారని అంటున్నారు. అలా ఎన్నికల ముందు బాబు ఓ ట్విస్ట్ ఇచ్చి, రామ్మోహన్‌ని అసెంబ్లీ బరిలో నిలిపితే బాగుంటుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: