ఈ మద్యనే జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ కి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే . అయితే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కూడా అంతగా కాకపోయినా కొంతలో తమ ప్రభావాన్ని ఈ ఎన్నికలలో చూపించాయి. అయితే ఎక్కువ చోట్ల గెలిచిన వైఎస్ఆర్ పార్టీ మీద తెలుగు దేశం పార్టీ నాయకులు నిప్పులు కక్కుతున్నారు. ఎన్నికలలో చాలా చోట్ల అభ్యర్థులని నిలబడనియకుండా ఏకగ్రీవంగా గెలుస్తున్నారు అని తెలుగుదేశం నాయకుల వాదన. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు గారు ఎన్నికలలో వై ఎస్ ఆర్ పార్టీ కి పోలీసులు సహాయం చేస్తున్నారు అని మండిపడుతున్నారు.

అసలు ఏం జరిగింది అంటే వై ఎస్ ఆర్ పార్టీ బలంగా ఉండే  కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో కొందరు పోలీసులు బెదిరింపులకు దిగరని వచ్చిన వార్తలపై చంద్రబాబు నాయుడు గారు స్పందించి అక్కడ ఉన్న పోలీసుల మీద మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ తరుపునుంచి నామినేషన్లు వేసిన వారిని తప్పుకోవాలని పులివెందుల లోని కొందరు పోలీసులు బెదిరింపులకు దిగడం అనేది చాలా దారుణమైన విషయంగా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు.


అలాగే  సింహాద్రిపురం మండలం నంద్యాలపల్లి గ్రామ పంచాయతీలో సోమశేఖర్‌రెడ్డి సహా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను ఏ తప్పు చేయకపోయినా కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారని ఆయన అన్నారు. అందులో  సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ అనిల్‌ రెడ్డి లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ  మద్దతు దారులను తప్పుడు కేసుల్లో ఇరికించి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని చంద్రబాబునాయుడు గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి గారి అండతో కొంతమంది పోలీసులు ఇలా ప్రజలని హింసితున్నారని , ఇలా చేయడం ప్రజాస్వామ్యం చూస్తూ ఉరుకోదు అని ఆయన పోలీసుల్ని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: