తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగడంతో విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.  అసలే పరిక్షలు ఆపై బస్సులు బంద్ దీంతో విద్యార్థులు నరక యాతన పడుతున్నారు. సంవత్సరం పొడువునా చదివిన చదువుకు సార్థకం లేకుండా పోతుందని వాపోతున్నారు. శుక్రవారం ఏపీ ఎంసెట్ ప్రవేశ పరీక్షలు జరుగుతుండటంతో పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు.  ఉదయం 10 గంటల నుండి ప్రారంభం అయ్యే ఈ పరీక్షలకు మొత్తం 2,55,409 మంది హాజరవబోతున్నారు. వారిలో 1,70,685 మంది ఇంజనీరింగ్, 84, 274 మంది విద్యార్ధులు వైద్య మరియు వ్యవసాయ పరీక్షకు హాజరవుతున్నారని రాష్ట్ర మానవ వనరుల అబివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.


ఎక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు


ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్ల కింద మండలాలకు బస్సులను ఏర్పాటు చేసింది. వారు మండల కేంద్రాలను చేరుకుని అక్కడ నుంచి పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే అక్కడ నుంచి మండల కేంద్రానికి కూడా ఏర్పాటు చేశామని చెబుతున్నా పరిస్థితి అంత సులభంగా లేదు. కొంత మంది రాత్రే పరీక్షా కేంద్రాలున్న నగరాలకు చేరుకున్నారు. అక్కడ వసతి లేక నానా అగచాట్లు పడ్డారు. కొందురు పేద విద్యార్థు పరీక్షా కేంద్రాల సమీపంలోని రోడ్లపై నిద్రించారు. అక్కడ వసతుల లేమితో ఇక్కట్ల పాలయ్యారు. హైదరాబాద్లో ఇంజనీరింగ్ విభాగానికి 17, మెడికల్, అగ్రికల్చర్ పరీక్షకు 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ విద్యార్థులకు హైదరాబాద్ ఒక్కటే సెంటర్ కేటాయించడంతో జిల్లాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా నగరానికి చేరుకుంటున్నారు.

పరిక్షలు రాస్తున్న విద్యార్థులు..


హైదరాబాద్లో కూడా బస్సులు తిరగకపోవడంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఎల్బీనగర్, హయత్ నగర్ శివారు ప్రాంతంలో పరీక్ష కేంద్రాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నారాయణగూడ, బర్కత్పుర తదితర సెంటర్లకు ఉదయం 7 గంటలకే విద్యార్థులు చేరుకున్నారు.  నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడే ఈ పరీక్షలకు 350 మంది నిర్వహాకులుగా మరొక 150 మందిని పరిశీలకులుగా ప్రభుత్వం నియమించింది. ఎంసెట్ ప్రాధమిక ‘కీ’ ని ఈనెల 10న ప్రకటించి దానిపై అభ్యంతరాలను ఈ నెల 15వరకు స్వీకరిస్తారు. అనంతరం ఈ నెల 26న తుది ‘కీ’ ని ప్రకటిస్తారు. అదే రోజు ర్యాంకులను కూడా ప్రకటిస్తారు.


మంత్రి ఘంటా సత్యనారాయణ

NewsListandDetails




మరింత సమాచారం తెలుసుకోండి: