భైంసా లో హిందువులపై జరుగుతున్నదాడులపై గవర్నర్ కు బిజెపి నేతలు ఫిర్యాదు చేసారు. భైంసా లో అరెస్టు చేసిన హిందూ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని గవర్నర్ ను రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు బండి సంజయ్, రామచంద్రరావు, ఎన్వీఎస్ ప్రభాకర్ , ప్రకాష్ రెడ్డి ల బృందం కోరింది. ఇక గవర్నర్ తో భేటీ అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. ప్రగతి భవన్ లోకి తొందరలోనే మా కార్యకర్తలు చొచ్చుకొచ్చి ముఖ్యమంత్రి ని బయటకు లాక్కోస్తారని అన్నారు. 7 వ తేదీన బైంసా లో జరిగిన సంఘటన పై రాష్ట్ర ప్రభుత్వం ఒకే వర్గానికి కొమ్ము కాసేలా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.

బైంసా లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని మండిపడ్డారు. అధికారులు , పోలీసులు ఎంఐఎం తో కుమ్మక్కు అయ్యారు అని ఆరోపించారు. దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని గవర్నర్ కు ఫిర్యాదు చేసామని వివరించారు. పక్క రాష్ట్రాలకు చెందిన లుచ్చా , లఫంగి గాళ్ళు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు విచారణ చేయలేదన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అంత కూలి ,నాలి చేసుకుంటూ ఉన్నారని, స్వయంగా కొంతమంది ఐ పి ఎస్ లు ఇండ్లలోకి వెళ్లి హిందువులను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.

అన్ని రాకలుగా నష్టపోయింది హిందువులే. ఆఖరుకు చిన్న పిల్ల మీద హత్యాచారం చేశారని, ఇన్ని జరుగతున్న ముఖ్యమంత్రి నోరు విప్పడు. ప్రజా సంఘాలు , పౌర హక్కుల సంఘాలు నోరు విప్పరని మండిపడ్డారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించి ...కోర్ట్ లో చెప్తే ఎన్కౌంటర్ చేస్తామని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసారు. ముఖ్యమంత్రి కి కుటుంభం లేదా.. మనుమలు , మనుమారాళ్లు ఉన్నారుగా... మీ కుటుంభం లో ఇలా జరిగితే ఉరుకుంటారా?? అని నిలదీశారు బండి సంజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: