కరోనా వైరస్... ఇప్పుడు ఇది కొత్తేమి కాదు. ప్రపంచాన్నే గడ గడ లాడించేస్తుంది. చైనా మూర్ఖత్వం వల్ల ప్రపంచమంతా దీని భారిన పడి ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పని వచ్చింది. అంతటి ప్రమాదకరమైన ఈ వైరస్ గతంలో ఎప్పుడూ కూడా కనీ వినీ ఎరుగని రీతిలో ప్రాణాలను తీసుకుంటుంది.ఈ వైరస్ వలన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది చనిపోయారు. ఎంతో ప్రాణ నష్టం జరిగింది. అలాగే ఎన్నో లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికి కూడా ఈ వైరస్ చాప కింద నీరులా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది ఈ కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్నారు.ఇక కరోనా వ్యాక్సిన్ వచ్చిన కాని కేసులు పెరుగుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. అలాగే కరోనా మరణాలు కూడా రోజు రోజుకి తీవ్ర స్థాయిలో పెరిగి పోతూ వున్నాయి.ఇక మన భారతదేశంలో కూడా కరోనా ఇంకా తీవ్ర స్థాయిలో విజరుంభిస్తుందనే చెప్పాలి. రోజుకి ఎన్నో వేల కేసులు నమోదవుతున్నాయి. అలాగే కరోనా మరణాలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి.



ఇక సుధీర్గమైన లాక్ డౌన్ తరువాత కూడా ఈ స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు పెరుగుతున్నాయంటే దీని తీవ్రత ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో అయితే రోజుకి 25 వేలకు పైగా కేసులు నమోదవుతూనే వున్నాయట. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు ఎక్కువవుతున్నాయి. మొన్న హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో ఒక స్కూల్ లో 36 మంది పిల్లలకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందట. ఇక ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు జన సమాచారం తగ్గించాలని చూస్తున్నాయట. అందుకే గుళ్ళలో కాని చర్చిలల్లో కాని మసీదులల్లో కాని జనాలు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం లేదట. కేవలం పాస్టర్లకి, పూజారులకి, అలాగే మసీదు పెద్దలకి మాత్రమే అనుమతులు ఇస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: