విజయనగరం జిల్లాలో మంత్రి సత్యనారాయణకు ఎదురులేదనే సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల నుంచి ఆయన్ని ఢీకొట్టడం ప్రత్యర్డుల వల్ల కావడం లేదు. అయితే రాష్ట్ర విభజన జరిగాక 2014 ఎన్నికల్లో బొత్స మళ్ళీ కాంగ్రెస్ తరుపున, చీపురుపల్లి నుంచి పోటీ చేయడం వల్ల ఓటమి పాలయ్యారు. కానీ అప్పుడు కూడా ఆయనకు ఓట్లు బాగానే పడ్డాయి.

ఆ తర్వాత వైసీపీలోకి వచ్చాక బొత్సకు తిరుగులేకుండా పోయింది. 2019లో మళ్ళీ గెలిచి సత్తా చాటారు. అయితే ఈయన మీద టీడీపీ తరుపున యువ నాయకుడు కిమిడి నాగార్జున పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2014లో నాగార్జున తల్లి మృణాలిని బొత్సపై విజయం సాధించారు. కాకపోతే అప్పుడు బొత్స కాంగ్రెస్ తరుపున పోటీ చేయడం వల్ల మృణాలిని విజయం సాధ్యమైంది.

కానీ గత ఎన్నికల్లో మాత్రం బొత్స వైసీపీ నుంచి పోటీ చేయడంతో నాగార్జునకు గెలవడం సాధ్యం కాలేదు. ఇక ఇప్పుడు బొత్స మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయన బలం మరింత రెట్టింపు అయింది. అయినా సరే నాగార్జున తన బాధ్యతలని సక్రమంగానే నిర్వర్తిస్తున్నారు. ఓటమి పాలైనా సరే నాగార్జున పార్టీ తరుపున బాగానే పనిచేసుకుంటున్నారు. ఎక్కడకక్కడ కార్యకర్తలకు అండగా ఉంటూ, వారిని కలుపుకునిపోతూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. స్థానికంగా ఉండే సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు బాగానే చేస్తున్నారు.

అయినా సరే నాగార్జునకు చీపురుపల్లిలో బలపడే ఛాన్స్ దొరకడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే అక్కడి ప్రజలకు ఇంకా బొత్స నాయకత్వంపై నమ్మకం పోలేదు. అలాగే నాగార్జున నాయకత్వంపై నమ్మకం పెరగలేదు. ఇలా సొంత నియోజకవర్గంలోనే కష్టపడుతున్న నాగార్జునకు, చంద్రబాబు విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడుగా బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్ స్థాయిలో కష్టపడిన నాగార్జునకు సరైన రిజల్ట్ రావడం లేదు. మొత్తానికైతే బొత్స ప్రత్యర్ధి బాగానే కష్టపడుతున్న కూడా టీడీపీ బలోపేతం కావడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: