దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పెట్ట‌ని విధంగా ఏపీ ముఖ్య మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంత్రి పదవులకు కూడా డెడ్ లైన్ పెట్టారు. ఈ ఘ‌న‌త‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్ర‌మే దక్కించ‌కున్నారు. జ‌గ‌న్ చేసిన ఈ ప్ర‌క‌ట‌న అప్ప‌ట్లో జాతీయ రాజ‌కీయాల్లో సైతం ఓ సంచ‌ల‌న‌మైంది. జగన్ 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అప్పుడు క్యాబినెట్ లో మంత్రులు గా ఎంపికైన వారందరిలో 90 శాతం మంది మంత్రులను. రెండున్న‌రేళ్ల త‌ర్వాత తొలగించి వారి స్థానాల్లో కొత్త వాళ్లకు అవకాశం ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యి రెండున్నర సంవత్సరాలు అవుతుంది.

దీంతో మంత్రి వ‌ర్గంలో కొంద‌రిలో కాస్త ఆందోళన మొదలైంది. ఎవరికి వారు ఎవరు ? క్యాబినెట్ లో ఉంటారు ? ఎవరు బయటకు వెళ్తారు... అనేదానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు మంత్రులు ఖ‌చ్చితంగా బయటకు వెళ్తారు అన్న లీకులు రావడంతో వారు సైలెంట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లిస్టులో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా ఉన్నట్టు విశాఖ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు అవంతి చంద్రబాబు - లోకేష్ తో పాటు , గంటా శ్రీనివాసరావు ను టార్గెట్గా చేసుకుని పదే పదే విమర్శలు చేసేవారు. అలాంటి  అవంతి ఇప్పుడు ఏమాత్రం యాక్టివ్గా ఉండటం లేదు.

ముఖ్యంగా విజ‌య‌సాయి రెడ్డి డామినేష‌న్ తో అవంతి రాజకీయంగా హైలెట్ కాలేక పోయారు. చివ‌ర‌కు అవంతి త‌న నియోజకవర్గం భీమిలీలో రాజకీయంగా పట్టు సాధించలేకపోయారు అంటున్నారు. ఆయన శాఖాపరంగానూ  గట్టిగా ఫోకస్ కాలేకపోయారన్న‌ది వాస్త‌వం. అధికార పార్టీకి చెందిన మంత్రిగా ఉండి కూడా ఆయ‌న ప‌లు స‌మ‌స్య‌ల‌పై ముఖ్య‌మంత్రికి లేఖ‌లు రాస్తున్నారు. అప్పుడే అవంతి ప‌ని అయిపోయింద‌ని చాలా మంది డిసైడ్ అయిపోయారు. ఏదేమైనా మంత్రి ప‌ద‌వి విష‌యంలో ఆయ‌న‌కు క్లారిటీ రావ‌డంతోనే ఆయ సైలెంట్ అయ్యార‌ని టాక్ ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: