భావితరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి వివరించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. కాళేశ్వరం పేరుతో నాలుగవ తరగతి తెలుగు పుస్తకంలోఈ పాఠ్యాంశాన్ని పొందుపర్చనున్నారు. ఇందులో కాళేశ్వరం ఆలయంతో పాటు ప్రాజెక్టు స్వరూపం గురించి వివరించారు. ఇక 4, 9తరగతుల్లో తెలుగును తప్పనిసరిగా అమలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశంతో ఉచిత తెలుగు వాచకాలు రూపొందిస్తారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్... ఈ వరల్డ్ లోనే చాలా పెద్దదైన ఎత్తిపోతలపథకం. కాళేశ్వ‌రం గొప్పతనమేంటో ప్ర‌పంచం కళ్లారా చూస్తోంది.  ఈ భూగర్భంలో అత్యాధునిక నిర్మాణం.. చాలా పొడవుగా ఉండే సొరంగం.. పెద్దపెద్ద మోటార్లతో నిర్మితమైంది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. మహదేవ్ పూర్ మండలంలోని కన్నెపల్లి సమీపంలో నిర్మించారు. గోదావరి నదిపై ఈ ప్రాజెక్ట్ కట్టడం విశేషం.

కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు 45లక్షల ఎకరాలు. దీని ప్రధాన లక్ష్యం 235టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే. గోదావరి నీటి ఎక్కువగా వాడటానికే ఈ ప్రాజెక్టును నిర్మించారు. ముఖ్యంగా కరువు ప్రాంతాలకు నీరు మరలించే విధంగా కట్టారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని హంగులతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నేషనల్ లెవల్ లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవల్ లో వెలుగొందుతోంది. ఈ మధ్య కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టపై డిస్కవరీ ఛానెల్ ద్వారా డాక్యుమెంటరీ రూపొందింది.  



కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేందుకు 80వేల 500కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 13జిల్లాలకు సాగు నీరు అందుతోంది. ఈ ప్రాజెక్ట్ కట్టడానికి 80వేల ఎకరాల భూమిని సేకరించారు. మరోవైపు మూడు వేల హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటున్నారు. తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు, పరిశ్రమలకు ఈ నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్ట్ ఉద్దేశ్యం ఏంటి.. ఎందుకు నిర్మించారు.. ఎంత ఖర్చుపెట్టారు.. ఎంత స్థలం సేకరించారు.. ఏ ఏ నిర్మాణాలున్నాయి.. ఎవరికి ఉపయోగం లాంటి విషయాలను పాఠ్యాంశంలో వివరంగా పొందుపర్చనున్నారు. దీనివల్ల విద్యార్థులకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి: