
ఇదే క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్, ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడులు పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ ఉత్తర నియోజకవర్గంపై కూడా టిడిపి అధిష్టానం స్పెషల్‌గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. విశాఖ సిటీ మొదట నుంచి టిడిపికి అనుకూలంగా ఉంటూ వస్తుంది. గత ఎన్నికల్లో సిటీలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో టిడిపి గెలిచింది.
ఈ క్రమంలోనే ఉత్తర నియోజకవర్గం నుచి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. అయితే గెలిచాక ఈయన టిడిపిలో యాక్టివ్‌గా పనిచేయడం లేదు. ఇప్పటికే పార్టీ మారిపోతారని అనేకసార్లు ప్రచారం జరిగింది. పార్టీ మారలేదు గానీ, అలా అని టిడిపిలో కూడా పనిచేయడం లేదు. దీంతో ఉత్తర నియోజకవర్గ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు...నియోజకవర్గంలో ఒక బలమైన ఇంచార్జ్‌ని పెట్టాలని టిడిపి అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గంటా సైడ్ అవ్వడం వల్ల నార్త్‌లో టిడిపి బాగా వీక్ అయిపోయిందని, ఇప్పటికైనా సరైన నాయకుడుని పెట్టకపోతే నియోజకవర్గాన్ని కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు. ఇదే క్రమంలో బిజేపి సీనియర్ నాయకుడు విష్ణు కుమార్ రాజుని టిడిపిలోకి ఆహ్వానించి, ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించిన పార్టీకి కాస్త బలం ఉంటుందని కొందరు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో టిడిపితో పొత్తులో భాగంగా విష్ణు, బిజేపి తరుపున నార్త్ లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎలాగో నార్త్‌లో విష్ణుకు ఫాలోయింగ్ ఉంది కాబట్టి, టిడిపిలోకి తీసుకొస్తే బెటర్ అని చెబుతున్నారు. మరి చూడాలి నార్త్ రాజకీయాలు ఎలా మారుతాయో?