తెలుగుదేశం పార్టీ అసలే కష్టాల్లో ఉంది...అయితే ఆ కష్టాలని తెలుగు తమ్ముళ్ళు మరింత పెంచుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వరుస ఓటములతో రాష్ట్రంలో టి‌డి‌పి పరిస్తితి దారుణంగా తయారైంది. ఇలాంటి పరిస్తితుల్లో పార్టీని పైకి లేపాల్సింది పోయి, ఒకరి ఒకరిపై ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తున్నారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టి‌డి‌పి‌లో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల పలు సంఘటనలు టి‌డి‌పిలో ఉన్న ఆధిపత్య పోరుకు నిదర్శనంగా ఉన్నాయి.

అయితే ఆధిపత్య పోరుకు అసలు కారణం....సీట్ల విషయమే అని అర్ధమవుతుంది. మొదట నుంచి విజయవాడలో టి‌డి‌పి నేతల మధ్య పెద్ద రచ్చ జరుగుతుంది. అక్కడ బుద్దా వెంకన్న, కేశినేని నాని వర్గాలకు పడటం లేదు. ఈ రెండు వర్గాలకు విజయవాడ వెస్ట్ సీటు విషయంలో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అటు కాకినాడలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ, మాజీ మంత్రి చినరాజప్ప వర్గాలకు పడటం లేదు.

కాకినాడ రూరల్ సీటు నుంచి పిల్లి దంపతులని సైడ్ చేయాలని చినరాజప్ప చూస్తున్నారని తెలుస్తోంది. ఇటు రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరీ, ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఇదే లొల్లి. ఇక సత్తెనపల్లి సీటు విషయంలో టి‌డి‌పిలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. ఆ సీటు కోడెల తనయుడు శివరాంకు ఇవ్వకూడదని కొందరు టి‌డి‌పి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సీటు తన కుమారుడు రంగబాబుకు కావాలని రాయపాటి సాంబశివరావు కోరుతున్నారు.

అటు అనంతపురంలో శింగనమల సీటు విషయంలో కూడా రచ్చ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. జే‌సి ఫ్యామిలీ వర్గమైన బండారు శ్రావణి అక్కడ ఇంచార్జ్‌గా ఉన్నారు. కానీ ఈ సీటుపై టి‌డి‌పి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం‌ఎస్ రాజు కూడా కన్నేశారని తెలుస్తోంది. ఆయన కూడా శింగనమల సీటు కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా రాష్ట్రంలో ఎక్కడకక్కడ టి‌డి‌పిలో సీట్ల లొల్లి జరుగుతుంది. సీట్లు కోసం నాయకులు ఒకరి వెనుక మరొకరు గోతులు తీయడానికి వెనుకాడటం లేదని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp