హుజూరాబాద్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు.. 23వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. అధికార పార్టీ అన్ని రకాలుగా యత్నించినా.. ఈటల మాత్రం గెలిచారు. పార్టీ మారినా తన స్థానం నిలబెట్టుకున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో ఆయన విజయానికి అనేక అంశాలు కారణమయ్యాయి. అందులో ప్రధానమైంది.. కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ  తన చరిత్రలోనే అతి తక్కువగా కేవలం 3 వేల ఓట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో 50 వేలకుపైగా ఓట్లు సాధించింది.


అలాంటిది 50 వేల నుంచి ఇప్పుడు ఏకంగా 3 వేల స్థాయికి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇలా దారణంగా విఫలం కావడం ఈటల రాజేందర్‌ గెలుపుకు ప్రధాన కారణం అయ్యింది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌ ముక్కోణపోటీలో ఓట్లు మూడు పార్టీల మధ్య చీలి ఉంటే ఈటల గెలుపు చాలా కష్టం అయ్యేది. కానీ.. ఇక్కడ కాంగ్రెస్ నిర్లిప్తత కారణంగా ముక్కోణ పోటీ కాస్తా ద్విముఖ పోటీగా మారింది. ఇది ఈటలకు అనుకూలంగా మారింది.


మరి.. హుజూరాబాద్‌ పై కాంగ్రెస్ ఎందుకు అంత నిర్లప్తత చూపింది. అందులోనూ ఇవి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక జరిగిన తొలి ప్రధాన ఎన్నికలు.. ఆయన సత్తా నిరూపించుకోవాల్సిన ఎన్నికలు.. అయితే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ మొదటి నుంచీ వెనుకబడే ఉంది. కేసీఆర్, ఈటల వంటి దిగ్గజాల పోరు కారణంగా తన సత్తా ఏంటో తెలిసినందువల్లే ఈ వెనుకబాటుకు కారణం కావచ్చు.. కానీ.. మరో వాదన కూడా తెరపైకి వస్తోంది.


ఈటల రాజేందర్ సతీమణి జమున.. ఈసారి ఎలాగైనా ఈటల విజయానికి సాయం చేయమని  రేవంత్ రెడ్డిని కోరారని.. అందుకే రేవంత్ ఈ ఎన్నికలను లైట్‌ గా తీసుకున్నారని టాక్ వినిపించింది. జమున కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. కాంగ్రెస్‌ పార్టీ కనీసం 10-15 వేలు సాధించినా ఈటలకు గెలుపు కష్టమయ్యేది. మరి ఈటల విజయానికి ఇది కూడా ఓ ప్రధాన కారణమనే చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: