మాజీ మంత్రి, విశాఖ నార్త్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజ‌కీయంగా కొత్త ఎత్తుగడలకు దిగుతున్నార‌ని గ‌త కొద్ది నెల‌లుగా వార్త‌లు వ‌స్తోన్న సంగతి తెలిసిందే. గంటా గ‌త ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి కూడా ఆయ‌న ఆ పార్టీలో ఉండేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో గంటా  ఏ పార్టీలోకి వెళితే తాను హీరో అవుతానో ? అన్న‌ది అంచ‌నా వేసుకుని మ‌రీ పార్టీ మారేందుకు రెడీ అవుతున్న వాతావ‌ర‌ణ మే ఉంది. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన - టీడీపీ పొత్తుల అంచ‌నాల నేప‌థ్యం లో గంటా చూపు జ‌న‌సేన వైపు ఉంద‌నే అంటున్నారు.

అయితే టీడీపీ - జనసేనల పొత్తు పై కూడా క్లారిటీ ఎన్నికలకు ఏడాది ముందే వస్తుంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే గంటా చాలా తెలివైన ఎత్తుగ‌డ వేస్తున్నార‌ట‌. ముందుగా తన కుమారుడు ర‌వితేజ‌ను జనసేనలోకి పంపాలన్న ఆలోచనలో గంటా ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు గంటా ప్రయత్నాలు మొద‌లు పెట్టేశార‌ని అంటున్నారు. ఇక గంటా విష‌యానికి వ‌స్తే ఆయ‌న ఇప్ప‌టికే అనేక పార్టీలు మారినా గెలుపు అంటిపెట్టుకునే ఉంటున్నారు.

అంగ‌, ఆర్థిక బ‌లాలు గంటా సొంతం. ఈ క్ర‌మంలోనే ఈ సారి జ‌నసేన లోకి వెళ్లి మ‌రో ఐదేళ్లు చ‌క్రం తిప్పాల‌ని ప్లాన్ తో ఉన్న గంటా అందుకు త‌గ్గ‌ట్ట‌గానే ప‌వ‌న్ ముందు భారీ ఎత్తున డిమాండ్లు పెట్ట‌బోతున్నార‌ని కూడా అంటున్నారు. ఆయ‌న గ‌తంలో ప‌వ‌న్ అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలోకి వెళ్లినప్పుడు కూడా అన్ని జిల్లాల్లో భారీ ఎత్తున‌ తన సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించుకోవ‌డంతో పాటు వారికి అనేక విధాలా సాయాలు చేశారు.

ఇక ఇప్పుడు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న టీంకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి.. పార్టీ అధికారంలోకి వ‌స్తే ఎవ‌రెవరికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌నే అంశంపై ఆయ‌న ప‌వ‌న్ తో గ‌ట్టిగా భేర‌సారాల‌కు దిగుతున్నార‌ట‌. మ‌రి గంటా డిమాండ్ల‌కు ప‌వ‌న్ ఓకే చెపుతారో ?  లేదో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: