2009 సెప్టెంబర్ 2 ఆదివారం రోజున తెలుగు ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు. ఏపీలో విషపు చీకట్లు కమ్ముకున్న విషాద రోజు, తెలుగు ప్రజలంతా గుండెలు పగిలేలా ఏడ్చిన రోజు. మన ప్రియతమ నాయకుడు శ్రీ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం పొందిన రోజది. చిత్తూరు జిల్లాలో 'రచ్చబండ’ ద్వారా ప్రజల గోడు వినడానికి బయలుదేరాడు, లక్షలాది మంది ప్రజలు ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో పిడుగు లాంటి ఆయన మరణ వార్త అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఏటీసీతో సిగ్నల్స్ అన్నీ కట్ అయిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆ వార్త విన్న తెలుగు ప్రజల గుండె చప్పుడు వేగం పెరిగింది.

తమ ఆరాధ్య నేతకు ఏమయ్యింది అన్న ఆందోళన ప్రతి ఒక్కరినీ దుఃఖ సంద్రంలోకి నెట్టేసింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉదయం 10.30 గంటలకు లాండ్ అవ్వాల్సి ఉండగా సరిగ్గా 9.30 సమయంలో హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోవడం ఊహించని పరిణామం. ఆయన హెలికాప్టర్ కోసం అధికారులు హుటాహుటిన గాలింపు చర్యలు  మొదలుపెట్టారు. గంటలు గడుస్తున్న కొద్దీ  అందరిలో ఒణుకు మరింత పెరిగింది. 12 గంటలు అలా నిర్విరామంగా గాలింపు చర్యలు జరగగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది నిర్దారించారు అధికారులు.  24 అనంతరం హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు ఆనవాళ్లు కనిపించాయి.

రుద్రకొండ కర్నూలు, ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆత్మకూరు - వెలుగోడుకు దగ్గర నల్లమల అడవుల్లో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఆ మహానేత భౌతిక దేహం కూడా లభించలేదు. ఆ ప్రమాదంలో ఆయన శరీరం తునాతునకలు అయిపోయింది. ఈ వార్తను జీర్ణించుకోలేక ఎన్నో తెలుగు గుండెలు ఆగిపోయాయి. ఆయన మరణ వార్తను జీర్ణించుకుని జీవించలేక పదుల సంఖ్యలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. 60 మందికి పైగా ప్రజలు ఆయన మరణ వార్త విని అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. అంతటి మహానేత మమ్మల్ని ప్రేమతో పాలించే రాజన్న ఇకలేరు అన్న వార్తను ఎవరు తట్టుకోలేకపోయారు.

ఈ ప్రయాణం మొదలవ్వక ముందు పాత హెలికాప్టర్ పెట్టారు ఏంటి అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారులను ప్రశ్నించారట .అయితే అందుకు వారు పలు కారణాలు తెలిపారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అదీ కాకుండా ఆ సమయంలో వాతావరణం అనుకూలంగా లేదని అధికారులు సూచించిన రాజన్న తన ప్రజలు తన కోసం ఎదురు చూస్తున్నారంటూ బయలుదేరారట. అదే ఆయన చివరి ప్రయాణం కావడం మన దురదృష్టకరం. అలా ఆరోజు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఒక గొప్ప ప్రజా నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: