ఇటీవలె తమిళనాడులోని నీలగిరి కొండల వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాఫ్టర్లు త్రివిధ దళాధిపతి తో పాటు ఆయన సతీమణి  కూడా ఉన్నారు. అంతే కాకుండా ఆర్మీ లోని కీలక అధికారులు కూడా హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ ఉండటం గమనార్హం. ఏకంగా 14 మందితో బయలుదేరిన ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ తునాతునకలు అయింది. దీంతో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 14మంది లో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అరుణ్ సింగ్ అనే  గ్రూప్ లీడర్ మాత్రం ఇక ఈ ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడగా.. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.



 ఈ ఘటన తో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. అయితే భారత రక్షణ రంగానికి మొదటి త్రివిధ దళాధిపతి బాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్  ఈ ప్రమాదంలో మరణించటం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలోనే ఇక బిపిన్ రావత్ దుర్మరణం పై అందరూ సంతాపం తెలియజేస్తున్నారు. అంతేకాదు ఇక బిపిన్ రావత్ భారత ఆర్మీ లో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో ఈ ప్రమాదం ఎలా జరిగి ఉంటుంది అనే దానిపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇక తమిళనాడులో కుప్పకూలిన హెలికాప్టర్ను నడిపిన పైలెట్ ఎవరు అన్నదానిపై సోషల్ మీడియాలో ఎంతోమంది వెతుకుతూ  ఉండటం గమనార్హం.



 కాగా ఇటీవల తమిళ నాడు లోని నీలగిరి హిల్స్ వద్ద కుప్ప కూలిన హెలికాప్టర్ నడిపిన పైలెట్ పేరు వింగ్ కమాండర్ పృథ్వి సింగ్ చౌహాన్. 109 హెలికాప్టర్ యూనిట్కు పృథ్వి సింగ్ చౌహాన్ కమాండింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు.  యూపీ లోని ఆగ్రా లో జన్మించిన పృధ్వి సింగ్ చౌహాన్ ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఈయనకు మొదటి పోస్టింగ్ హైదరాబాద్లోనే రావడం గమనార్హం. ఇక ఇటీవలే హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో  పైలెట్ పృద్వి సింగ్ చౌహాన్ కూడా మరణించారు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: