నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికార వైసీపీ టార్గెట్‌గా రాజకీయం చేస్తూనే...మరోవైపు సొంత పార్టీలోని తప్పిదాలని కూడా సరిచేస్తున్నారు. పార్టీని ఎక్కడకక్కడే బలోపేతం దిశగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల్లో కీలక మార్పులు తీసుకోస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడకక్కడ గెలుపు గుర్రాలని సెట్ చేసే పనిలో ఉంటున్నారు.

ఇదే క్రమంలో ఇటీవల గుంటూరులోని కొందరు కమ్మ నేతలకు సీట్లు విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వినుకొండ సీటులో జీవీ ఆంజనేయులు పోటీ చేస్తారని బాబు కన్ఫామ్ చేసేశారు. ఆ మధ్య వినుకొండలో జరిగిన శావల్యాపురం జెడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకోవడంతో...నెక్స్ట్ ఎన్నికల్లో వినుకొండలో జీవీ బరిలో దిగి విజయం సాధించడం ఖాయమని చెప్పేశారు.

ఇదే క్రమంలో నరసారావుపేట పార్లమెంట్ సీటు రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీకి ఇస్తారని తెలిసింది. అటు సత్తెనపల్లి సీటు కోసం రాయపాటి ఫ్యామిలీ ట్రై చేస్తుంది. కానీ ఆ సీటుని కోడెల తనయుడు శివరాంకే కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇలా ఎక్కడకక్కడే కమ్మ నేతలకు క్లారిటీ ఇచ్చేస్తున్నారు.

అయితే గుంటూరు వెస్ట్ సీటు విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతానికి అక్కడ కోవెలమూడి రవీంద్ర ఇంచార్జ్‌గా బాధ్యతలు చూసుకుంటున్నారు. కానీ ఆయనకు సీటు ఫిక్స్ చేస్తారా? లేదా? అనేది డౌట్‌గా ఉంది. ఈ సీటు కోసం కూడా రాయపాటి ఫ్యామిలీ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కూడా ట్రై చేసినట్లు తెలిసింది.

కానీ శ్రీధర్‌కు పెదకూరపాడు సీటు కన్ఫామ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. అలాంటప్పుడు గుంటూరు వెస్ట్ సీటు విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంటుంది. మరి ఈ సీటుని రవీంద్రకు ఫిక్స్ చేస్తారో లేక వేరే నాయకుడుని తీసుకొచ్చి వెస్ట్‌లో పోటీకి పెడతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: