తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి-నారా ఫ్యామిలీల కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించి బలమైన పునాదులు వేస్తే....చంద్రబాబు పునాదులని మరింత స్ట్రాంగ్ చేసి ముందుకు తీసుకెళుతున్నారు. ఇలా రెండు ఫ్యామిలీలతో టీడీపీ మరింత ముందుకెళుతుంది. అయితే పార్టీలో ఇప్పుడు రెండు ఫ్యామిలీలకు చెందిన వారు కూడా ఉన్నారు. చంద్రబాబుని పక్కనబెడితే...ఆయన తనయుడు నారా లోకేష్ పార్టీలో కీలకంగా ఉన్నారు...అటు నందమూరి బాలకృష్ణ సైతం ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణలో నందమూరి సుహాసిని పార్టీలో ఉన్నారు.

అయితే పార్టీలోకి మరో ఫ్యామిలీ సభ్యుడు రావాలని అనుకుంటున్నట్లు తెలిసిందే. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు తనయుడు నారా రోహిత్ టీడీపీలోకి రావడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్మూర్తి నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన విషయం తెలిసిందే. 2004 తర్వాత ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం లేదు. ఇక ఆయన తనయుడు రోహిత్...సినిమాల్లోకి వచ్చి రాణిస్తున్న విషయం తెలిసిందే. అలాగే పార్టీ కోసం ప్రచారం కూడా చేస్తుంటారు.

ఇలా వెనుక ఉండి పార్టీ కోసం పనిచేస్తున్న రోహిత్...ఇప్పుడు పార్టీలో యాక్టివ్ గా ఉండాలని డిసైడ్ అయినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కొందరు టీడీపీ సీనియర్లతో కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా తాను కృష్ణా జిల్లాలో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ముఖ్యంగా గుడివాడ, గన్నవరంల్లో ఏదొక చోట పోటీ చేయాలని అనుకుంటున్నారట.

ఇప్పటికే కృష్ణా జిల్లాలోని టీడీపీ సీనియర్లతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. అదేవిధంగా తన పెదనాన్న చంద్రబాబుని కలిసి మనసులో ఉన్న కోరికని బయటపెట్టినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు అప్పుడే రోహిత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. కానీ పరిస్తితులని బట్టి రోహిత్‌ని కూడా పార్టీలోకి తీసుకొచ్చి అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి నారా రోహిత్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో?

 

మరింత సమాచారం తెలుసుకోండి: