- ప్ర‌జా స‌ద‌నంలో జ‌న్మ‌దిన వేడుక‌లు
 
- త‌ర‌లివ‌చ్చిన అభిమానులు

- సామాజిక సేవ‌లో ముందుంటూ...
బాధ్య‌తల నిర్వ‌హ‌ణ‌లో ఆద‌ర్శ‌మ‌వుతూ...
రాణిస్తున్న వైనం పై అభినంద‌న‌ల వెల్లువ


పాల‌క ప‌క్షంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్న తిరుగులేని నేత‌గా త‌న‌దైన ముద్ర వేసుకున్న యువ ఎంపీ జ‌న్మ‌దిన వేడుకల‌కు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గుండ ల‌క్ష్మీదేవి విచ్చేసి, ఆత్మీయ సందేశం అందించారు. ఆ వివరాలివి..............


శ్రీ‌కాకుళం న‌గ‌రం : దేశ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేస్తూ రాణిస్తున్న యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు, మున్ముందు కూడా ఇదే సంక‌ల్పంతో ప‌ని చేసి ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించాల‌ని మాజీ ఎమ్మెల్యే గుండ ల‌క్ష్మీదేవి ఆకాంక్షించారు. స్థానిక ప్ర‌జాస‌ద నంలో యువ ఎం పీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు జ‌న్మ‌దిన వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌యోజ‌నా ల సాధ‌న విష‌య‌మై ఎప్ప‌టికప్పుడు పార్ల‌మెంట్ లో గ‌ళమెత్తే యువ కిశోరం ఎంపీ రామూనే అని కితాబిచ్చారు. రాష్ట్రానికి ప్ర‌స్తుతం జ‌రుగుతు న్న అన్యాయంపై కేంద్రాన్ని ప్ర‌శ్నించి, నిల‌దీసిన ఘ‌న‌త ఆయ‌న‌దేన‌ని గుర్తు చేశారు. ముఖ్యంగా ప్ర వాసాంధ్రుల క‌ష్టాలు తెలుసుకుని, వారికి స‌కాలంలో సాయం అందించిన  ప్ర‌తీసారీ తానెంతో సంతోషిస్తాన‌ని చెప్పారు. నాన్న ఎర్ర న్నాయుడి అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ..ఆయ‌న ఆశ‌య స్ఫూర్తితో ప‌నిచేస్తున్న ఎంపీ రామూ భ‌విష్య‌త్ లో యువ‌త‌కు దిశా నిర్దేశం చేసే స్థా యికి ఎద‌గాల‌ని ఆకాం క్షించారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల రీత్యా అటు కేంద్ర స‌ర్కారు నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి జిల్లాకు అందుతున్న ఆ ర్థిక సాయం అంతంత‌మాత్ర‌మేన‌ని, ఈ ప్రాంత ప్ర‌జ‌లు ఎప్ప‌టిక‌ప్పుడు అభివృద్ధి దూరంగా ఉం టూ, మ రింత వెనుక‌బాటుకు గురి అవుతున్నార‌ని అలాంటి సంద‌ర్భాల్లో మ‌న త‌ర‌ఫున వినిపించే హ‌క్కుల వాక్కు ఎంపీ రామూ నేన‌ని కితాబిచ్చారు. వేడుక‌ల్లో భాగంగా కేక్ క‌ట్ చేసి, అభిమానుల‌కు తినిపించారు. తొలుత ఎన‌భై అడుగుల ర‌హ‌దారిలో ఉన్న ఎర్ర‌న్నా యుడి విగ్ర‌హానికి తెలుగుదేశం నాయ‌కులు పూల మాల‌లు వేసి నివాళులర్పించారు. కార్య‌క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు  బ‌గ్గు ర‌మ‌ణ మూర్తి, మెండ దాసు నాయుడు, నాగావ‌ళి కృష్ణ, ప్ర‌జా స‌ద‌నం నిర్వాహ‌కులు మెండ ల‌చ్చ‌న్న‌, బ‌స్వా నాని  త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: