గ‌త ఏడాది హిందువుల ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల‌లో ఒక‌టైనా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో క‌రోనా నిబంధ‌న‌ల న‌డుమ శ్రీ‌వారి ద‌ర్శ‌నాన్ని చేసుకునే అవ‌కాశం టీటీడీ అధికారులు కల్పించారు. ఈ త‌రుణంలో స్వామివారినీ దేశ‌విదేశాల నుండి ప్ర‌ముఖుల‌తో పాటు.. అనేక మంది శ్రీ‌వారి భక్తులు ద‌ర్శించుకున్నారు. ముఖ్యంగా 2021 జ‌న‌వ‌రి 1 నుండి డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు మ‌ధ్య‌కాలంలో శ్రీ‌వారి  హుండీ వ‌సూళ్లు రూ.833 కోట్లు అని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌టించిన‌ది.

ప్ర‌పంచంలోని అత్యంత ధ‌నిక పుణ్య‌క్షేత్రాల‌లో ఒక‌టైనా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుమ‌ల శ్రీ‌వెంక‌టేశ్వ‌ర ఆల‌యాన్ని టీటీడీ నిర్వ‌హిస్తుంది. కొండ‌పై ఉన్న పుణ్య‌క్షేత్రాన్ని ద‌ర్శించుకున్న భ‌క్తులు 1.04 కోట్ల మంది ఉన్నారు. స్వామి వారి ప్ర‌సాదం ల‌డ్డులు 5.96 కోట్లు, 1.37 కోట్లు అన్న ప్ర‌సాదాన్ని విక్ర‌యించిన‌ది. 48.75 ల‌క్ష‌ల మంది క‌ల్యాణ‌క‌ట్ట వ‌ద్ద త‌మ మొక్కులు చెల్లించుకున్న‌ట్టు వెల్ల‌డించింది. 2021 ఏడాదిలో 1కోటి మంది భ‌క్తులు తిరుమ‌ల‌ను సంద‌ర్శించారు అని, హుండీ వ‌సూలు మొత్తం రూ.833 కోట్లు అని ప్ర‌క‌టించింది.

2021 మే నెల‌లో ఇక నుంచి స్వామి వారి స్థిరాస్తుల‌ను వేలం వేయ‌రాదు అని, క్ర‌య విక్ర‌యాలు జ‌రుప‌రాద‌ని.. టీటీడీ నిర్ణయించిన సంగ‌తి తెలిసిన‌దే. తిరుప‌తి కొండ‌ల్లో వెలిసిన వేంక‌టేశ్వ‌ర స్వామికి భ‌క్తులు విరాళంగా ఇచ్చిన స్థిరాస్తుల‌ను ఇక నుంచి భ‌ద్రంగా కాపాడాలి అని నిర్ణ‌యించింది. ఇదే విష‌యంపై టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. శ్రీ‌వారి ఆస్తుల‌ను ఆదాయాన్ని ఏవిధంగా వినియోగించుకోవాలో అనే విష‌యంపై అధ్య‌య‌నం చేసేందుకు అధికారులు,మేధావులు, హిందూ ధార్మిక సంస్థ‌ల అధినేత‌లు, భ‌క్తుల‌తో కూడిన క‌మిటీనీ త్వ‌ర‌లో ఏర్పాటు చేయాలి అని బోర్డు నిర్ణ‌యించింద‌ని వెల్ల‌డించారు.

స్వామివారి విష‌యంలో భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. స్వామివారి ఆస్తుల విక్ర‌యాల‌పై నిషేధం విధిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేయ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టీటీడీ చైర్మ‌న్ వివ‌రించారు. అదేవిధంగా శ్రీ‌వారి మొత్తం ఆభ‌ర‌ణాలు, ఆదాయ‌, వ్య‌యాలపై పూర్తి వాస్త‌వాల‌ను వెలికి తీయ‌డానికీ విజిలెన్స్ లేదా ఏదైనా ద‌ర్యాప్తు క‌మిటీనీ ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాయాల‌ని టీటీడీ బోర్డు నిర్ణ‌యించింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకునే భ‌క్తుల సంఖ్య‌ను పెంచ‌డానికీ తాము కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ అనుమ‌తి కోసం ఎదురుచూస్తున్నాం అని.. బోర్డు చైర్మ‌న్ వివ‌రించారు. ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు వ‌చ్చిన వెంట‌నే శ్రీ‌వారి ద‌ర్శ‌నాల సంఖ్య‌ను పెంచ‌డానికీ పూర్తిగా సిద్ధంగా ఉన్న‌ట్టు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: