సహారా.. ఈ పేరు చిన్నప్పడు పుస్తకాల్లో చదువుకునే ఉంటాం.. అంటార్కిటికా తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారిగా ఈ సహారా ఎడారికి పేరుంది. ఇప్పుడు ఈ ఏడాది మరోసారి వార్తల్లోకి ఎక్కింది.. ఈ సహారా ఎడారి క్రమంగా విస్తరిస్తోందట.. ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈ సహారా ఎడారి విస్తరిస్తుండటంతో దాని చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎడారిలా మారిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లోనూ వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు సహారా ఎడారిని ఆనుకుని ఉన్న దేశాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి.


ఈ సహారా ఎడారి సుమారు 90 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఈ  ఎడారీకరణను అడ్డుకునేందుకు 20కి పైగా ఆఫ్రికా దేశాలు ఇప్పుడు చేతులు కలిపాయి. ఎడారీకరణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ చర్యలకు 2007లోనే బీజం పడింది. సహారా ఎడారి విస్తరణను అడ్డుకోవాలంటే.. చెట్లు పెంచడం ఒక మార్గం.. అందుకే సహార పరిసర ప్రాంతాల్లో భారీగా చెట్లు పెంచే కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ దేశాలకు వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు.


సహారా ఎడారీకరణను నిలువరించేందుకు 2007లోనే  గ్రేట్‌ గ్రీన్ వాల్‌ ప్రాజెక్టును ప్రారంభించారు.  దీని ప్రకారం 2030 నాటికి ఆఫ్రికా ఖండంలో ఉన్న 8 వేల 50 కిలోమీటర్ల పొడవునా చెట్లు నాటాలన్నది లక్ష్యం. కానీ వీరి సంకల్పానికి వాతావరణం సహకరించడం లేదు. ఆఫ్రికా ప్రాంతంలో కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. వర్షాలు కూడా బాగా తగ్గాయి. దీంతో గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు పేరుతో నాటిన లక్షల మెుక్కలు ఎండిపోయాయి.


గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు పేరుతో చేపట్టిన కార్యక్రమం అంతగా విజయవంతం కాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణ కోసం ఆఫ్రికా దేశాలు సమావేశం అవుతున్నాయి. సహారా బారి నుంచి తమ భూభాగాలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపడితే బావుంటుందనే అంశంపై మథనం జరుపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: