సాధారణంగా రెడ్డి సామాజికవర్గం ప్రభావం రాయలసీమ జిల్లాల్లో ఉంటుందనే సంగతి తెలిసిందే. రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, కాస్త గుంటూరు జిల్లాలో కూడా రెడ్డి వర్గం హవా ఉంటుంది. కానీ కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు చూస్తే రెడ్డి వర్గం హవా పెద్దగా ఉండదు. కమ్మ, కాపు, బీసీ, ఎస్సీల హవా ఎక్కువ ఉంటుంది. అందుకే ఆ వర్గాలకే సీట్లు ఇస్తుంటారు.

అయితే వైసీపీలో రెడ్డి వర్గం డామినేషన్ ఎక్కువనే సంగతి తెలిసిందే. అందుకే ఆ పార్టీలో ఉన్న రెడ్డి నేతలు కొందరు కోస్తాలో కూడా ప్రభావం చూపుతారు. ఉదాహరణకు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో పనిచేస్తున్నారు. ఇటు వైవీ సుబ్బారెడ్డి ఉభయ గోదావరి జిల్లాని చూసుకుంటున్నారు. అదేవిధంగా కాపులు, బీసీలు, ఎస్సీల ప్రభావం ఎక్కువగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో కూడా ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. అది కూడా వైసీపీ నుంచే.

ఇక ఇందులో అనపర్తి సీటులో మొదట నుంచి రెడ్డి వర్గం నేతలే పోటీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే రెండు పార్టీల నేతలు రెడ్డి వర్గం వారే ఉంటారు. అలా అని అక్కడ రెడ్డి వర్గం ఓట్లు తక్కువే. కాపులు, బీసీ ఓట్లు ఎక్కువ. సరే ఆ సీటుని పక్కనబెడితే అసలు ఏ మాత్రం రెడ్డి వర్గం ఓట్లు లేని కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొత్తపేటలో చిర్ల జగ్గిరెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో అసలు రెడ్డి వర్గం ఓట్లే తక్కువ. అయినా సరే వైసీపీలో రెడ్డి వర్గం హవా ఎక్కువ కాబట్టి వారికి సీట్లు దక్కాయి.


అయితే ఈ ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలకు ఈ సారి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అది కూడా వీరు పవన్ వల్ల డేంజర్ జోన్‌లోకి వెళ్ళేలా ఉన్నారు. ఎందుకంటే నెక్స్ట్ పవన్, టీడీపీకి సపోర్ట్ చేస్తే...ఈ ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలు గెలవడం చాలా కష్టమైన పని.

మరింత సమాచారం తెలుసుకోండి: