విద్యార్థి నేత కాంగ్రెస్ యంగ్ లీడ‌ర్ క‌న్హ‌య్య కుమార్ పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్  లో దాడి జ‌రిగిన‌ది. ల‌క్నోలో ఆయ‌న ప్రచారం చేస్తుండ‌గా.. ఆయ‌న‌పై ఓ యువ‌కుడు సిరా విసిరారు. అది ఇంక్ కాదు అని, ఒక ర‌క‌మైన యాసిడ్ అని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. ఈ యాసిడ్ విసిరిన వారి వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు. సిరాతో చేసిన వ్య‌క్తిని పార్టీ కార్య‌క‌ర్త‌లు ప‌ట్టుకున్న‌ట్టు స‌మాచారం. క‌న్హ‌య్య కుమార్ పై ఓ యువ‌కుడు విసిరిన ఘ‌ట‌న కాంగ్రెస్ కార్యాల‌యంలోనే జ‌రిగిన‌ది. సిరా విసిరిన అనంత‌రం యువ‌కులు ముర్దాబాద్ అంటూ నినాదాలు చేసారు.

కాంగ్రెస్ యువ‌నేత క‌న్హ‌య్య కుమార్ కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు ప్ర‌చారం చేసేందుకు ల‌క్నో చేరుకున్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ల‌క్నోలోని కాంగ్రెస్‌లో ఉండ‌గా.. ల‌క్నో సెంట‌ర్ స్థానానికి కాంగ్రెస్ అభ్య‌ర్థి స‌దాఫ్ జాఫ‌ర్ నామినేష‌న్‌లో పాల్గొనేందుకు వ‌చ్చిన క‌న్హ‌య్య కుమార్‌పై సిరా విసిరారు.  సిరా విసిరిన ఘ‌ట‌న త‌రువాత క‌న్హ‌య్య కుమార్‌కు దాని వ‌ల్ల ఎటువంటి హానీ జ‌రుగ‌లేదు అని, అత‌నిపై రెండు చుక్క‌లు మాత్ర‌మే ప‌డ్డాయి అని పేర్కొన్నారు. ప‌క్క‌నే నిల‌బడిన ముగ్గురు, న‌లుగురు యువ‌కుల‌పై ప‌డింద‌ని కాంగ్రెస్ నేత‌లు చెప్పారు. వెంట‌నే పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆ నిందిడిని అరెస్ట్ చేసారు. లక్నోలో కాంగ్రెస్ అభ్య‌ర్థుల కోసం క‌న్హ‌య్య కుమార్ డోర్ టూ డోర్ ప్ర‌చారం చేస్తూ ఉన్నారు. అరెస్ట్ అయిన యువ‌కుడి పేరు దేవాన్ష్ బాజ్‌పాయ్‌గా పోలీసులు గుర్తించారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌న‌వ‌రి 08న అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన‌ది. 403 సీట్ల 18వ అసెంబ్లీకి ఫిబ్ర‌వ‌రి 10 నుంచి మార్చి 07 వ‌ర‌కు ఏడు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌రుగ‌నున్న‌ది. మార్చి 10న  ఐదు రాష్ట్రాలకు సంబంధించిన‌ ఎన్నిక‌ల ఫ‌లితాలు రానున్నాయి. ఇదిలా ఉండ‌గా.. యూపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌డానికి ల‌క్నో చేరుకున్నారు. ప్రియాంక గాంధీ సారథ్యంలో ఈ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని.. క‌న్హ‌య్య‌కుమార్ పేర్కొన్నారు. యూపీలో హ‌థ్రాస్‌, ల‌ఖింపూర్ ఖేరి, ఉన్నావ్ ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్ప‌టి నుంచి వీధుల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ న్యాయం కోరుతుంద‌ని చెప్పారు. దేశాన్ని నిర్మించ‌డం చేత‌గాని వారు.. దేశాన్ని అమ్మేస్తూ ఉన్నార‌ని ప‌రోక్షంగా బీజేపీపై విమ‌ర్శ‌లు సంధించారు. గ‌తంలో కూడా క‌న్హ‌య్య కుమార్‌, జిగ్నేశ్ మేవానీల‌పై ఇంర‌ఖ విసిరిన ఘ‌ట‌న‌లున్నాయి. 2018లో గ్వాలియ‌ర్‌లో వీరిపై హిందూ సేన‌కు చెందిన ముఖేష్ పాల్ ఇంక్ విసిరాడు. క‌న్హ‌య్య కుమార్, జిగ్నేశ్ మేవానీలుగా గ్వాలియ‌ర్‌లో నిర్వ‌హించిన సంవిధాన్ బ‌చావో కార్య‌క్ర‌మంలో మాట్లాడ‌టానికి వెళ్లిన సందర్భంగా 2018లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: