నవ్వుల నవాబు బ్రహ్మానందం. తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్రహ్మానందం సుపరిచితుడు. ఈయన లేని సినిమాలు శూన్యం. తన కామెడీ టైమింగ్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నారు. త్రి జనరేషన్స్ యాక్టర్‌తో కలిసి పని చేసిన గొప్ప నటుడు. సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడంటే.. ఆ సినిమా కచ్ఛితంగా హిట్ కొట్టాల్సిందే. ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలొయింగ్‌ను, క్రేజ్‌ను పెంచుకున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ కమెడియన్లు వచ్చారు. వెన్నెల కిషోర్, సప్తగిరి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ తదితర కమెడియన్లు రావడంతో బ్రహ్మానందానికి కాస్త అవకాశాలు తగ్గాయి. బ్రహ్మానందం వయసు కూడా పైబడటంతో ఆయన సినిమాల్లో ఆచితూచి నటిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇటీవల బ్రహ్మానందంకు గుండె ఆపరేషన్ జరిగింది. దీంతో ఆయన అప్పటిలా సినిమాల్లో నటించడం లేదు. ఈయన చివరిసారిగా ‘జాతిరత్నాలు’ సినిమాలో జడ్జి పాత్రలో నటించారు. అయితే ప్రస్తుతం ఆయన తన ఆత్మకథ రాస్తున్నట్లు సమాచారం. ఈ పుస్తకంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన కష్టాల గురించి, ఇండస్ట్రీలోని ప్రముఖులతో తనకున్న సంబంధాల గురించి తెలుపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పుస్తకం పూర్తయ్యే దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తం కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో.. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం బ్రహ్మానందం ‘రంగమార్తాండ’ సినిమాతోపాటు పలు సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. బ్రహ్మానందంకు పద్మశ్రీతోపాటు పలు అవార్డులు వచ్చాయి. అతి తక్కువ సమయంలో 1000కిపైగా సినిమాలు చేసి గిన్నిస్ బుక్‌ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసుకున్నారు. దాదాపుగా ఆయన 1250 సినిమాల్లో నటించినట్లు సమాచారం.


బ్రహ్మానందం కేవలం నటుడే కాదు.. ఒక ఆర్టిస్టు కూడా. కరోనా లాక్‌డౌన్ సమయంలో పెయింటింగ్స్ కూడా వేసి.. వాటిని కొంత మంది హీరోలకు బహుమతి ఇచ్చారు. తెలుగు లెక్చరర్‌గా ఉన్న బ్రహ్మనందం.. అప్పట్లో దూరదర్శన్‌లో ‘పకపకలు’ అనే ప్రోగ్రాంలో ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత ‘అహనా పెళ్ళంట’ సినిమా నుంచి సినీ లైఫ్ స్టార్ట్ అయింది. వరుస ఆఫర్లు రావడంతో తన లైఫ్ మొత్తానికి యూటర్న్ అయింది. తన రెమ్యూనరేషన్‌తో వచ్చిన డబ్బులతో భూముల్లో పెట్టుబడి పెట్టాడు. అలా తన ఆస్తి విలువ దాదాపు రూ.500 కోట్లు ఉన్నట్లు సమాచారం. అయితే బ్రహ్మానందంకు ఏ చెడు అలవాట్లు లేవు. అందుకే తను ఇంత ఆస్తి సంపాదించినట్లు పలువురు చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: