ఆంధ్రాకు తెలంగాణ‌కు మ‌ధ్య వివాదాలేవీ లేవు.కానీ కొత్త వివాదం మంత్రి ఆది మూలం స‌ర్ కార‌ణంగా వ‌చ్చింది. క‌నుక ఇప్పుడీ వివాదం  తో తెలంగాణ నాయ‌కులు ఏ విధంగా స్పందిస్తారో మ‌రి! అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం ఇప్ప‌టికే కాలానుగుణ స‌వ‌ర‌ణ‌లు అందుకుంటోంది. ఆ ఉద్దేశంతోనూ మ‌రియు రాష్ట్రాల స‌మాఖ్య స్ఫూర్తికి విఘాతం ఇచ్చేలా కేంద్రం ఉంటుంద‌న్న కోపంతోనో కేసీఆర్ ఇటీవ‌ల కొన్ని వ్యాఖ్య‌లు చేయ‌డం వాటిపై రాజకీయ పార్టీలు మ‌రియు వైసీపీ పెద్ద‌లు కూడా స్పందించ‌డంతో రాజ‌కీయ తుఫాను ఒక‌టి తెలంగాణ నుంచి ఆంధ్రా దిశ‌గా ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. పెను వివాదాల‌కు కార‌ణం అవ్వ‌క‌ముందే నాయ‌కులు కాస్త సంయ‌మ‌నం పాటిస్తే కేసీఆర్ క్లారిఫికేష‌న్ విన‌వ‌చ్చు.

కొత్త వివాదం ఒక‌టి ఆరంభం అయింది
ఆదిమూలం సురేశ్ అనే మంత్రి త‌న‌దైన శైలిలో
కేసీఆర్ పై విరుచుకుప‌డ్డారు
దీంతో ఇప్పుడీ మాట‌లు వాటి వెనుక ఉన్న నేప‌థ్య వార్త‌లు
అన్నీకూడా పెను వివాదాలే సృష్టిస్తున్నాయి
ఆంధ్రావ‌నిలో కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌లు పెను సంచ‌ల‌నం రేపుతున్నాయి.రాజ్యాంగంలో మార్పులు తీసుకుని రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్న మాట మ‌రో  అర్థానికి మ‌రో అపార్థానికి తావిస్తోంది.ఈ నేప‌థ్యంలో ఏపీ మంత్రి ఆదిమూలం సురేశ్ స్పందించారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్క‌ర‌ణ‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కేసీఆర్ ను ఉద్దేశిస్తూ కొంత‌మంది కుహ‌నా మేధావులు రాజ్యాంగాన్ని మార్చాల‌ని అంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం వెనుక కొంత తీవ్రమ‌యిన కోప‌మే దాగి ఉంది. రాజ్యాంగంలో ఏ అంశం పై వారికి అభ్యంత‌రం కానీ క‌లిచివేసే ధోర‌ణికానీ ఉందో తెలియ‌జెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.దీంతో మంత్రి వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ద‌ళితుల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీస్తున్నాయ‌ని అంటున్నారీయ‌న.

మరోవైపు కేసీఆర్ వ్యాఖ్య‌లు అటు బీజేపీకి కోపం తెప్పించాయి. రాజ్యాంగం జోలికి వ‌స్తే ఊరుకోబోమ‌ని తెలంగాణ ఎంపీ, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షులు బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.ఇదే త‌రుణంలో రాజ్యాంగం మార్చాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని
కొన్నిద‌ళిత సంఘాల వాద‌న కూడా వినిపిస్తోంది.ఉన్న‌దానినే అమ‌లు చేయ‌డం చేత‌గాక ప్ర‌భుత్వాలు ఉన్నాయ‌ని ఇంకొన్ని
 ప్ర‌జా సంఘాలు మండిప‌డుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: