శ్రీ‌కాకుళం జిల్లా,ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన ఎప్ప‌టి నుంచో పోరాటం చేస్తూనే ఉంది.ఫ‌లితంగా ఎన్నో స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తెచ్చింది.గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంలో ప‌వ‌న్ దీక్ష చేసి, బాధిత ప‌క్షాన నిలిచి,వారి గోడును రాష్ట్రానికీ,కేంద్రానికీ ఏక కాలంలో తెలియజేశారు.ఇక్క‌డ  ఏళ్ల త‌ర‌బ‌డి ప‌ట్టిపీడిస్తున్న క్రానిక్ కిడ్నీ డిసీజెస్ పై జ‌న‌సేన ప్ర‌తినిధి డాక్ట‌ర్ దుర్గారావు ఓ నివేదిక రూపొందించి సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎస్వీ ర‌మ‌ణ‌కు అందించారు.ఆ మ‌ధ్య విజ‌య‌వాడ వ‌చ్చిన సంద‌ర్భంగా సీజేను క‌లుసుకుని ఈ ప్రాంత బాధితుల గోడును విశ్లేష‌ణాత్మ‌క రీతిలో వివ‌రించారు.గ‌తంలో కూడా ఈయ‌న ఇక్క‌డ నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై ఉద్దానంలో ఉన్న క‌న్నీటి గాథ‌ల‌ను అటు ప‌వ‌న్ దృష్టికి తీసుకువెళ్లారు.ఇప్పుడు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కూడా ఉద్దానం బాధ‌లు విని చ‌లించి,వీటిపై సంబంధిత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ‌కు ఆదేశించారు.ఈ మేర‌కు దుర్గారావుకు లేఖ రాశారు.ఈ లేఖ‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను త‌న దృష్టికి తీసుకువ‌చ్చినందుకు దుర్గారావును అభినందిస్తూ,శుభాకాంక్ష‌లు తెలిపారు.


ఇదీ స‌మ‌స్య
శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రానికి కానీ, విశాఖ‌కు కానీ రావాల్సి వ‌స్తోంది.ముఖ్యంగా ఇక్క‌డి నీటిలో సిలికాన్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండ‌డంతో ఈ నీరు తాగిన వారి కిడ్నీల చుట్టూ సిస్ట్ (ప‌లుచ‌ని పొర‌) ఏర్ప‌డుతోంది.అంతేకాదు సోడియం కంటెంట్ ఉన్న ఉప్పుచేప‌ని ఎక్కువ‌గా తిన‌డం వ‌లన హైబీపీ వ‌చ్చి ఆ..త‌రువాత కిడ్నీ వ్యాధి బారిన ప‌డుతున్నారు ఇక్క‌డి జ‌నం.ముఖ్యంగా ఇక్క‌డి ఆహార వ్య‌వ‌హారాల్లో ఉప్పు చేప వాడ‌కం విరివిగా ఉండ‌డం ఒక్క‌టే కాదు గుట్కా, ఖైనీలతో స‌హా ప‌లు హానికర మ‌త్తు ప‌దార్థాల‌కు మ‌త్స్య కారులు అల‌వాటు ప‌డుతుండంతో శ‌రీరంలో నీటి నిల్వ‌లు త‌క్కువై మూత్ర‌పిండాల ప‌ని తీరు మొరాయిస్తోంద‌ని అప్ప‌ట్లో ఇక్క‌డ గ్రామాల్లో క‌లియ‌దిరిగిన ప్ర‌భుత్వ ఉద్యోగి సుగుణాక‌ర్ చెబుతున్నారు.

ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ
జ‌న‌సేన వినిపిస్తున్నడిమాండ్లు..
- ఉద్దానంలోని అన్ని గ్రామాల్లోనూ మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాల ద్వారా వ్యాధి నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి.
- ప్ర‌తి డయాల‌సిస్ కేంద్రంలోనూ కిడ్నీ వ్యాధుల‌కు సంబంధించి శిక్ష‌ణ పొందిన పారా మెడిక‌ల్ సిబ్బందిని నియ‌మించాలి.
- వారానికొక‌సారి డ‌యాల‌సిస్ కేంద్రానికి నెఫ్రాల‌జిస్టు వెళ్లి వైద్యం అందించాలి.
- ఉద్దానంలోని అన్ని గ్రామాల్లోనూ మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాల ద్వారా వ్యాధి నిర్థార‌ణ ప‌రీక్ష‌లు ఎప్ప‌టిక‌ప్పుడు నిర్వ‌హించాలి.
- డయాల‌సిస్ కేంద్రాలు పెంచాలి. వీటికి అనుబంధంగా బ్ల‌డ్ బ్యాంకులు ఏర్పాటుచేయాలి.
- కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌కు అవ‌స‌ర‌మైన మందులను స‌క్ర‌మంగా  ఉచితంగా అందించాలి.కొన్నే ఉన్నాయి మిగిలిన‌వి బ‌య‌ట కొనుక్కోండి అన్న స‌మాధానం రాకూడ‌దు.
- డ‌యాల‌సిస్ చేయించుకుంటున్న‌వారు.. ఆ స్టేజ్  కు చేరిన వారి వివరాలు ప‌క్కాగా న‌మోదు చేయాలి.
- పింఛ‌న్లు మిగుల్చుకునే క‌క్కుర్తి లెక్క‌లు క‌ట్టిపెట్టాలి.
- కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డేవారికి ఉచిత ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించాలి.
- శుద్ధి చేసిన ర‌క్షిత తాగునీటిని గ‌డ‌ప‌గ‌డ‌ప‌కీ అందించాలి. అందుకు సంబంధించి శుద్ధి ప్లాంట్ల ప‌నుల‌ను వెంట‌నే పూర్తి చేయాలి.
- ఉద్దానంలో ఈ వ్యాధి ప్ర‌బల‌డానికి మూలాల‌ను అన్వేషించే ప‌రిశోధ‌న కేంద్రం త‌క్ష‌ణ‌మే ఏర్పాటుకావాలి.
- శ్రీ‌లంక లో ఆ దేశాధ్య‌క్షుడు స్వ‌యంగా అక్క‌డి కిడ్నీ వ్యాధుల ప్ర‌భావిత ప్రాంత స‌మ‌స్య‌ని ప‌ర్య‌వేక్షిస్తారు.

అదేవిధంగా మ‌న రాష్ట్రంలోనూ ముఖ్య మంత్రి స్వ‌యంగా కిడ్నీ స‌మ‌స్య నివార‌ణ  చేప‌ట్టే చ‌ర్య‌ల్ని ప‌ర్య‌వేక్షించాలి.ఇందుకు స్పెష‌ల్ యాక్ష‌న్ టీం ఏర్పాటుచేయాలి.
- రాష్ట్రానికి త‌క్ష‌ణ‌మే వైద్య ఆరోగ్య  శాఖ మంత్రిని నియమించాలి.
- ఉద్దాన ప్రాంతంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టించాలి.
- కేంద్ర ప్ర‌భుత్వం ఉద్దాన స‌మ‌స్య త‌మ ప‌రిధిలోనిది కాద‌ని త‌ప్పించుకోకూడ‌దు.
-  కేంద్ర ఆరోగ్య శాఖ ఈ అంశంపై దృష్టి పెట్టి రాష్ట్ర ప్ర‌భుత్వంతో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ త‌గిన స‌హాయ..స‌హ‌కారాలు ఇవ్వాలి.
- శ్రీ‌కాకుళం జిల్లాలోని ప్ర‌తి ఎమ్మెల్యే, ఎంపీ కిడ్నీ రోగుల్ని ద‌త్త‌త తీసుకుని వారికి త‌గిన వైద్య సాయం అందుతుందో లేదో ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షించాలి.
- కార్పొరేట్ సంస్థ‌లు సీఎస్ఆర్‌లో భాగంగా ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌కు అవ‌స‌ర‌మైన సేవాకార్య‌క్ర‌మాలు చేయాలి.
- ప్ర‌తి కార్పొరేట్ ఆస్ప‌త్రి విధిగా త‌మ వైద్య సిబ్బందిని, త‌మ ద‌గ్గ‌ర ఉన్న నెఫ్రాల‌జిస్టుల‌ని ఈ ప్రాంతానికి ఎప్ప‌టిక‌ప్పుడు పంపించి ఉచితంగా వైద్య సేవ‌లు అందించాలి.
- ఉద్దాన ప్రాంతంలోని ప్ర‌తి ఒక్క‌రికీ స‌శాస్త్రీయంగా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి. వ్యాధి తొలిద‌శ‌లో ఉన్న‌వారిని త‌క్ష‌ణం గుర్తించి మందులు ఉచితంగా ఇవ్వాలి.
- శ్రీ‌కాకుళంలో కిడ్నీ వ్యాధుల‌కు సంబంధించి సూప‌ర్ స్పెషాల‌టీ ఆస్ప‌త్రి ప్రారంభించాలి.
- శ్రీ‌కాకుళం రిమ్స్‌లో త‌క్ష‌ణ‌మే నెఫ్రాల‌జిస్టును నియమించాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: