సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో ఎలాంటి తప్పు జరిగినా ఆయన మాత్రం ఉపేక్షించేది లేదని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అది ఎంతటి వారైనా, ఎవరైనా సరే ప్రజా పాలనకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటామని, కెసిఆర్ చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్నారు. మొన్నటి వరకు ఈటల రాజేందర్ విషయంలో కూడా ఇదే పద్ధతి కొనసాగింది. అయితే మళ్ళీ కేసీఆర్ క్యాబినెట్ లో మరో మంత్రి చేసినటువంటి తప్పులతో కేసీఆర్ దృష్టి లో పడ్డట్టు తెలుస్తోంది. మరి ఏం జరగబోతుందో తెలుసుకుందామా..!

 తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం జరగనుంది. సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి మరో మంత్రి ఔట్ అవుతారని తెలుస్తోంది. ఆ అమాత్యుడు ఆగడాలు, ఉద్యోగుల వేధింపులపైనా సీఎంవో  ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరి ఆ అమాత్యుడు లీలలు  ఏంటో తెలుసుకుందామా..!
 ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాల్లో మాత్రం సంచలనమే జరగబోతుందని ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరో మంత్రి క్యాబినెట్ నుంచి ఔట్ అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. క్యాబినెట్ నుంచి మంత్రి ఔట్ అవ్వడమే కాకుండా అతనికి సంబంధించిన కొంతమందిని తొలగిస్తారని ప్రచారం మాత్రం జరుగుతుంది. పూర్తి స్థాయిలో డీటెల్స్ మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే ఉద్యోగుల వేధింపులపై సీఎంఓ ఆరా తీసి  వివరాలను  సేకరించినట్లు తెలుస్తోంది. ఆ మంత్రి గురించి పూర్తి వివరాలను సీఎం కేసీఆర్ కు కూడా తెలియజేసినట్లు సమాచారం.


కానీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ విషయం తెలిసి  ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. కానీ ఆ మంత్రి మాత్రం దిక్కుతోచని స్థితిలో భయాందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఢిల్లీ కిడ్నాప్ వ్యవహారంలో కూడా ఆ మంత్రి గారికి హస్తం ఉన్నట్టు, ఆ కిడ్నాప్ ను పూర్తిస్థాయిలో మంత్రిగారే చేయించారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. దీంతో ఈ విషయంపై ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా ఆగ్రహంతో ఉన్నట్లు, అలాగే ఉద్యోగుల విషయంలో కూడా వేధింపులకు గురి చేసిన విషయంలో కూడా పూర్తిస్థాయిలో ఆరా తీసి  ఎక్కడెక్కడ ఏ విధంగా ఉద్యోగులను వేధింపులకు గురి చేశారో పూర్తి సమాచారం సీఎంఓ కేసీఆర్ తెలియజేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: