జాతీయ రాజకీయాల‌ను శాసించే శ‌క్తి
తెలంగాణ చంద్రుడు అవుతాడా లేదా
అయితే ఏ విధంగా అన్న‌ది
ఇవాళ అంద‌రినీ ఆలోచింప‌జేస్తున్న
ప్ర‌శ్న.. ఆరా తీసేందుకు ఆస్కారం ఇస్తున్న వివ‌రం కూడా!

3 రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌రువాత కేసీఆర్ ఇవాళ 1 రోజు ప‌ర్య‌ట‌న నిమిత్తం ఝార్ఖండ్ వెళ్లారు.వెళ్ల‌డంతో జాతీయ రాజ‌కీయాల్లో పెను చ‌ర్చ జ‌రుగుతోంది.గ‌తంలో కేసీఆర్ మాదిరిగానే వేర్పాటు వాదాన్ని బ‌లీయంగా వినిపించిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబు సోరెన్ ను క‌లిసి  ఆశీస్సులు తీసుకోవ‌డం విశేషం.ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

............................ఇవ‌న్నీ ఫ‌లితం ఇస్తాయా
అన్ని క‌ల‌యిక‌లూ క‌ల‌ల తీరానికి చేరుస్తాయా?
గ‌త కొద్ది రోజులుగా జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌దైన హ‌వా నెల‌కొల్పాల‌ని కేసీఆర్ భావిస్తూ ఉన్నారు.ఇందులోభాగంగా గ‌తం క‌న్నా వేగంగా ఆయ‌న ప‌రిణామాల‌ను అవ‌లోక‌న చేసుకుని జాతీయ రాజ‌కీయాల్లో స్థిర‌ప‌డిపోవాల‌ని ఉత్సాహం చూపుతున్నారు.మోడీ క‌న్నాభిన్నంగా రాజ‌కీయాలు చేసేందుకు వివిధ మార్గాల‌లో బీజేపీయేత‌ర నాయ‌కుల‌ను క‌లిసేందుకు ఆసక్తి క‌న‌బ‌రుస్తున్నారు.
ఇందులో భాగంగా ఝార్ఖండ్ వెళ్లారు. అక్క‌డ దారి పొడ‌వునా కేసీఆర్ ఫ్లెక్సీలు ద‌ర్శ‌నం ఇచ్చాయి.ఆయ‌న‌కు అక్క‌డ కూడా అభిమానులు అనూహ్య రీతిలో స్వాగ‌తం ప‌లికారు.ఇదే సంద‌ర్భంలో ప‌లువురు నాయ‌కుల‌తోనూ అదే విధంగా ఆ రాష్ట్ర పెద్ద‌ల‌తో సీఎం కేసీఆర్ స‌మాలోచ‌న‌లుచేశారు.ఇవ‌న్నీ ఫ‌లితం ఇస్తాయా అన్న‌దే ఇప్పుడిక ఆస‌క్తిక‌రం.

అభివృద్ధి పై ఆవేద‌న
మార్పు త‌థ్యం అని చెబుతున్నారు కేసీఆర్

తెలంగాణ చంద్రుడు ఝార్ఖండ్ దారుల్లో సంద‌డి చేస్తున్నాడు.శిబు సోరెన్ (ఝార్ఖండ్ ముక్తి మోర్చా అధ్య‌క్షుడు)ను క‌లిసి ఆయ‌న ఆశీస్సులు తీసుకున్నాడు.గాల్వ‌న్ లోయ‌లో చైనా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్ద‌రు వీర జ‌వానుల కుటుంబాల‌కు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున చెక్కులు అందించి వారి కుటుంబాల‌ను ఓదార్చి వ‌చ్చారు. అటుపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో భేటీ అయి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.అటుపై విలేక‌రుల‌తో మాట్లాడారు.త్వ‌ర‌లో జాతీయ స్థాయిలో అమ‌లు అయ్యే రాజకీయ ప్ర‌త్యామ్నాయంపై నిర్ణ‌యంవెలువ‌రిస్తాన‌ని తెలిపారు.దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 70 ఏళ్లు గ‌డిచినా కూడా అభివృద్ధి మాత్రం ఆశించిన రీతిలో జ‌ర‌గ‌లేద‌ని కేసీఆర్ ఆవేద‌న చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs