ఇపుడిదే విషయంపై  రాజకీయవర్గాల్లో చర్చలు జరుగుతోంది. అనుచిత లబ్దికోసం, టికెట్ల కోసం పార్టీల మధ్య కప్పలతక్కెడలాగ జంప్ చేసేవాళ్ళకు, ఫిరాయింపుదారులను జనాలు విశ్వసించరనే విషయం గతంలోనే నిరూపితమైంది. 2014లో వైసీపీ తరపున గెలిచి తర్వాత టీడీపీలోకి 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపీలు ఫిరాయించారు. తర్వాత వాళ్ళల్లో చంద్రబాబునాయుడు టికెట్లిచ్చింది కొందరికే. అయితే పోటీచేసిన వారిలో గెలిచింది మాత్రం గొట్టిపాటి రవి మాత్రమే.





ఇక టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి, మేడా మల్లికార్డునరెడ్డి, రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళు గెలిచారు. ఇపుడు సమస్య ఏమిటంటే మేడా, ఆనం లాంటి వాళ్ళు వైసీపీలో నుండి మళ్ళీ టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వీళ్ళకు వైసీపీలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదట. మేడాకు బాగానే ప్రాదాన్యత దక్కినా జిల్లాల పునర్వ్యవస్ధీకరణ కారణంగా మళ్ళీ టీడీపీలోకి వెళ్ళేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.




వీళ్ళే కాదు కర్నూలులో బుట్టా రేణుక, ఎస్వీ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అధికారపార్టీలో నుండి టీడీపీలోకి వెళ్ళిపోయేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి వీళ్ళందరు టీడీపీలోకి వెళ్ళాలంటే టికెట్లపై హామీ తీసుకునే వెళతారు కదా. చంద్రబాబు టికెట్ ఇస్తారు సరే ఓట్లు ఎవరేయిస్తారు ? ఎలా గెలుస్తారు ? ఎన్నికకో పార్టీ మారే ఇలాంటి నేతల వల్ల టీడీపీకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా అనే విషయాన్ని చంద్రబాబు ఆలోచించాలి.




సొంతలాభమే కానీ పార్టీ గురించి కొంచెమైనా ఆలోచించని ఆనం, మేడా, బుట్టా లాంటి వాళ్ళ వల్ల పార్టీకి లాభం ఉండకపోగా నష్టంమాత్రం భారీగానే ఉంటుంది. ఈ విషయం 2019లోనే నిరూపితమైంది. అయినా చంద్రబాబు ఆలోచనల్లో మార్పురాలేదు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేబదులు పార్టీలోనే కొత్తతరాన్ని ప్రోత్సహిస్తే గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీకి భవిష్యత్తుంటుంది.  అయినా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఈ విషయాలు ఒకరు చెప్పాలా ?



మరింత సమాచారం తెలుసుకోండి: