పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. ఇక ఈ పథకం ద్వారా దాదాపు రెండు వేలకు పైగా వ్యాధులను ఇక ప్రభుత్వం సూచించిన ఆస్పత్రులలో ఉచితంగా చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ పథకం పేద ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారు జగన్ ప్రభుత్వానికి రుణపడి ఉన్నాము అంటూ చెబుతున్నారు ఇక్కడ గుండెజబ్బుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఏకంగా పునర్జన్మ ప్రసాదించింది.


 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేందుకు ఏకంగా 25 లక్షల రూపాయలు కావాల్సి ఉంది.  నిరుపేద కుటుంబమైనా ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలిచింది. రూపాయి కూడా ఖర్చు లేకుండానే ఉచితంగా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చును భరించేందుకు సిద్ధమైంది. దీంతో ఆ పేద కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.. కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం నరుకుల్లపాడు కు చెందిన ఇరవై ఏడేళ్ల  రాంబాబు ప్రైవేట్ సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతనికి భార్య శిరీష ఒకటిన్నర సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నారు. గత ఏడాది రాంబాబు గుండెల్లో నొప్పిగా ఉంది అంటూ విజయవాడలోని కార్పొరేట్ చేరగా.. ఆసుపత్రి వైద్యులు పరీక్షించి గుండె 70 శాతం పనిచేయడం లేదని నిర్ధారించారు.


 దీంతో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం అంటూ వైద్యులు తెలిపారు. దీని కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అయితే వైద్యానికి 25 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో ఆ నిరుపేద కుటుంబం ఎంతగానో దిగులు చెందింది.. ఈ క్రమంలోనే  వైఎస్సార్సీపీ నాయకుల ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను సంప్రదించగా ఆరోగ్యశ్రీ అధికారులతో మాట్లాడి బెంగళూరులోని వైదేహి మెడికల్ ఆసుపత్రిలో ఇక రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను ఈ నెల 10వ తేదీన వైద్యులు రాంబాబుకు అమర్చారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. దీంతో ఆ కుటుంబం సంతోషం లో మునిగిపోయింది. ఇక ఆరోగ్యశ్రీ పథకం దేవుడిలా మమ్మల్ని ఆదుకుంది అంటూ ఆ పేద కుటుంబం ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: