
ఇటు తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నల్గొండ, ఆసిఫాబాద్ జిల్లాల్లో కుండ పోత వర్షాలు కురిశాయి..అధిక శాతం వర్షం రంగారెడ్డి జిల్లా సంగంలో 16 సెంటీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా ఉదిత్యాలలో 15.63, నాగర్ కర్నూలు జిల్లా తోటపల్లిలో 13.63 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరులో 13.13, ఆమనగల్లో 12.68, వనపర్తిలో 12.53, రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేటలో 11.58, నాగర్ కర్నూల్ జిల్లా యనగంపల్లిలో 11.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది..
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో 10.30 సెంటీమీటర్ల వర్షం పడింది. గత రెండురోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు రైతులు సైతం పొలం పనుల్లో నిమగ్న మయ్యాయరు. క్రమంగా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనా లు విస్తరిస్తున్నాయి.ఇప్పుడు మరాఠ్వాడ, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, తమిళనాడు లోని మిగిలిన ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలు విస్తరించాయి. డయ్యూ, నందుర్బార్, జల్గావ్, పర్బని, రెంటచింతల, మచిలీపట్నం మీదుగా పవనాలు వెళ్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు బంగాళాఖాతం లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. బీహార్ నుంచి తూర్పు మధ్య ప్రదేశ్ మీదుగా ఏపీ తీరం వరకు కేంద్రీకృతమైంది.. మొత్తానికి రైతులకు కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి..ఏపీ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి