తెలంగాణా ప్రభుత్వానికి ఇద్దరు సినీ ప్రముఖులకు మధ్య పెద్ద వివాదమే మొదలైంది. అదికూడా కోర్టుకెక్కిన వివాదంలో ఉన్న భూమి వ్యవహారం. రంగారెడ్డి జిల్లాలోని శేరలింగంపల్లి ఖానామెట్ లో ఉన్న భూమి కావటంతో బాగా ఖరీదైనది. ఇంత ఖరీదైన భూమిని వదులుకునేందుకు ఇటు ప్రముఖ కుటుంబాలు కానీ అటు ప్రభుత్వం కానీ వెనక్కు తగ్గటంలేదు. దాంతో వివాదం కాస్త హైకోర్టు తలుపులు తట్టింది.






ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇద్దరు ప్రముఖులకు-ప్రభుత్వానికి మధ్య  వివాదం కోర్టుకెక్కినా ఎల్లోమీడియా మీడియా కామ్ గా ఉండిపోవటం. వివాదంలో మీడియా ఎక్కడా తలదూర్చకపోవటానికి కారణం ఏమిటంటే కేసీయార్ అంటే ఉన్న భయమే. ప్రభుత్వంపై  అడ్డుగోలుగా వార్తలు, కథనాలు అచ్చేస్తే తర్వాత  ఏమిజరుగుతుందో మీడియాకు బాగా తెలుసు. పైగా ఇద్దరు కూడా ఒకే సామాజికివర్గానికి చెందిన సినీ ప్రముఖులు కూడా. అయినా సరే కేసీయార్ అంటే వెన్నులో భయముంది కాబట్టే అన్నీ మూసుకుని ఏమి కనబడనట్లు, ఏమీ వినబడనట్లే ఎల్లోమీడియా మీడియా చూస్తు ఉండిపోయింది.






ఇదే ఇష్యు ఏపీలో గనుక జరిగుంటే ఈ పాటికి భూమి దద్దరిల్లిపోయేట్లుగా గోల గోల జరిగిపోతుండేది. ఇంతకీ విషయం ఏమిటంటే ఖానాపేట్ లో 26 ఎకరాల భూమిని ఎప్పుడో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత రామానాయుడు కుటుంబాలు 1961 ప్రాంతంలో నరసింహులు నాయక్ అనే వ్యక్తినుండి కొన్నట్లు పత్రాలున్నాయి. అయితే అప్పటి ఎంఆర్వో సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు సృష్టించి నాయక్ నుండి పై రెండు సినీకుటుంబాలు కొన్నట్లు ప్రభుత్వం వాదిస్తోంది.






సింగిల్ జడ్జి సినీ కుటుంబాలకు అనుకూలంగా తీర్పిస్తే ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాలుచేసింది. భూమిపై ఎలాంటి హక్కులు లేని వ్యక్తినుండి పై రెండు కుటుంబాలు కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం వాదిస్తోంది. ప్రభుత్వం తీరుచూస్తుంటే ఇంతటి ఖరీదైన భూమిని రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేష్ బాబులకు వదిలేట్లు లేదు. వివాదం తెలంగాణాలో జరుగుతోంది కాబట్టి జగన్ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే కేసీయార్ ఏ విధంగా వ్యవహరించినా అన్నీ మూసుకుని కూర్చుంటుంది మీడియా, టీడీపీ.







మరింత సమాచారం తెలుసుకోండి: