ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేయటం బీజేపీకి ఫ్యాషన్ గా మారిపోయింది. నాన్ బీజేపీ ప్రభుత్వాలను అస్ధిరపరచటం, పార్టీలను చీల్చేసి ప్రభుత్వాలను పడగొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నది. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో మూడోసారి ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చింది.  నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంట్లో నలుసులాగ తయారయ్యారు.





70 సీట్లున్న ఆసెంబ్లీలో ఆప్ కు 62 మంది ఎంఎల్ఏలున్నారు. ఎప్పటినుండో లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను అడ్డంపెట్టుకుని కేంద్రప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నానా విధాలుగా రాచిరంపాన పెడుతున్నారు. అయినా సరే మోడీకి లొంగకుండా ప్రభుత్వాన్ని లాక్కొస్తున్నారు. దీన్ని  ఎంతమాత్రం సహించలేని బీజేపీ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్లాన్ మొదలుపెట్టింది. ఆప్ ఎంఎల్ఏలతో బేరసారాలు మొదలుపెట్టినట్లు ఆప్ ముఖ్యులు ఆరోపణలు గుప్పించారు.





జరుగుతున్న పరిణామాలను ఎంఎల్ఏలతో చర్చించేందుకు కేజ్రీవాల్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ విషయాన్ని బుధవారమే ఎంఎల్ఏలందరికీ పంపించారు. అయితే సమావేశానికి 12 మంది ఎంఎల్ఏలు డుమ్మాకొట్టారు. వాళ్ళసలు సీఎం ఫోన్ కు కూడా దొరకటంలేదు. వాళ్ళ ఆచూకీని తెలుసుకునేందుకు సీఎం ఎంతప్రయత్నించినా సాధ్యంకాలేదు. 40 మంది ఎంఎల్ఏలను లాగేసుకుని ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటు కేజ్రీవాల్ మండిపోతున్నారు. తమ ఎంఎల్ఏలు ఎక్కడున్నారో కూడా తమకు ఆచూకీ దొరకటంలేదని మొత్తుకుంటున్నారు.





మరి ఆప్ ఎంఎల్ఏలు వాళ్ళంతట వాళ్ళే ఎక్కడన్నా హైడౌట్ లో దాక్కున్నారా లేకపోతే బీజేపీనే వాళ్ళని ఎక్కడైనా దాచేసిందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళంతట వాళ్ళే ఎక్కడో దాక్కోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరమైతే కేజ్రీవాల్ అధికారికంగానే షెల్టర్ ఏర్పాటుచేస్తారు. వాళ్ళ ప్రమేయంలేకుండానే వాళ్ళని ఎవరైనా తీసుకెళ్ళిపోయుంటారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఈరోజు 12 మంది ఎంఎల్ఏలు కనబడటంలేదు బాగానే ఉంది, మరి రేపటి సంగతేంటి ? రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఎంఎల్ఏలు కనబడకుండా పోతారో అర్ధం కావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: