ఎప్పుడూ సీరియస్ గా మాత్రమే ఉండే చంద్రబాబునాయుడు ఒక్కసారిగా జోకులు పేలిస్తే ఎదుటివాళ్ళు తట్టుకోలేరు. ఇపుడింతకీ విషయం ఏమిటంటే  మీడియాతో మాట్లాడుతు చెప్పిన ఐదారుపాయింట్లపై తెగ నవ్వు వస్తోంది. ఇంతకీ ఆ పాయింట్లు ఏమిటంటే రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టంకన్నా జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే ఎక్కువ నష్టం జరిగిందట. తాను రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తారట. అధికారంలో ఉన్నపుడు పాలనపై ఎక్కువగా దృష్టిపెట్టడం వల్లే టీడీపీ రెండుసార్లు ఓడిపోయిందట.





ఇక సంక్షేమపథకాలకు శ్రీకారంచుట్టింది టీడీపీయేనట. టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పటికన్నా రెట్టింపు సంక్షేమపథకాలను అమలుచేస్తానన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఆర్ధికలోటున్నా తెలంగాణాలో కన్నా ఏపీలోనే ఎక్కువ సంక్షేమపథకాలు అమలుచేసినట్లు చెప్పారు. ఇక్కడే చంద్రబాబు ఎంత పెద్ద జోక్ వేశారో జనాలకు అర్ధమవుతోంది. రాష్ట్ర విభజన కన్నా జగన్ వల్లే ఎక్కువ నష్టం జరుగుతోందని చెప్పిన చంద్రబాబు మొదటి సీఎం తానే అన్న విషయాన్ని మరచిపోయినట్లున్నారు.





ఇక రాష్ట్రప్రయోజనాల కోసమే కేంద్ర రాజకీయాలను చూస్తానన్నారు. చంద్రబాబు రాజకీయంలో రాష్ట్ర రాజకీయం ఎప్పుడూ ఉండదు. ముందు తన ప్రయోజనాలు తర్వాత పార్టీ ప్రయోజనాలు మాత్రమే చూస్తారన్న విషయం అందరికీ తెలుసు. ఎవరితో పొత్తు పెట్టుకుంటే తనకు లాభమో అంచనా వేసుకుని రాజకీయాలు చేస్తారన్న విషయం చిన్న పిల్లాడికి కూడా తెలుసు. ఇంతోటిదానికే రాష్ట్ర ప్రయోజనాలంటు బిల్డప్పులిస్తున్నారు. ఇక అధికారంలో ఉన్నపుడు పాలనపై ఎక్కువ దృష్టిపెట్టడం వల్లే పార్టీ ఓడిపోయిందన్నది కూడా నిజంకాదు.





ఎప్పుడు అధికారంలో ఉన్నా పార్టీతో జనాలతో చంద్రబాబుకు కాంటాక్టు కట్టయిపోతుందన్నది అందరికీ తెలుసు. టీడీపీ ఓడిపోయిన రెండుసార్లు ఒంటరిగా పోటీచేసే ఓడిపోయింది. సంక్షేమపథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీ అన్నది కూడా కరెక్టుకాదు. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల క్రితమే కాంగ్రెస్ మొదలుపెట్టింది. టీడీపీ వచ్చిన తర్వాత అంటే ఎన్టీయార్ హయాంలో సంక్షేమపథకాలు మొదలయ్యాయే కానీ చంద్రబాబు హయాంలో కాదు. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏపీ శ్రీలంక లాగ కాకుండా అమెరికాలాగ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: