
కరోనా తర్వాత కార్మికుల వలసల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనికింద ప్రభుత్వం కార్మికులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రతి కార్డుదారునికి రూ.2 లక్షల బీమా అందిస్తోంది. దీంతో పాటు ఈ కార్డు హోల్డర్లు కార్మిక మంత్రిత్వ శాఖ పథకాల ప్రయోజనాలను కూడా పొందుతున్నారు..
వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు, రోజువారీ కూలీలు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు, రిక్షా పుల్లర్లు, భవన నిర్మాణ కార్మికులు ఈ-శ్రమ్ కార్డ్ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి వయస్సు 16 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. మీరు ఈ పథకం కోసం ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..ప్రస్తుతం ఈ పథకం ద్వారా 28 కోట్ల మంది లబ్ది పొందుతున్నారు.
దాదాపు 38 కోట్ల మంది కార్మికులను ఈ పథకంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సంఘటిత రంగంలో పనిచేసే వారు అలాగే EPFO ఖాతాదారులుగా ఉన్నవారు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోలేరు. దీంతో పాటు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకం కోసం దరఖాస్తు చేయలేరు. అంతేకాకుండా NPS,EPFO లబ్దిదారులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందడం కుదరదు..
తర్వాత eSHRAMలో రిజిస్టర్ లింక్‌ని ఓపెన్ చేయాలి.
తర్వాత మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. తర్వాత OTPని ఎంటర్ చేయాలి.
అన్ని వివరాలను నింపిన తర్వాత ఫారమ్‌ను సమర్పించాలి.
ఈ-శ్రమ్ యోజన కోసం ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ అవసరమవుతాయి...ఇదే ఈ-శ్రామ్ కార్డ్ గురించి పూర్తి వివరాలు..