దేశ రాజకీయాల్లో చాలా కాలం నుండి కీలక పాత్ర పోషించిన పార్టీ కాంగ్రెస్. అయితే ఈ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ దూరం అయినప్పటి నుండి ఈ సమస్యలు మొదలయ్యాయి. ఆమె తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టే వారు ఎవరు అంటూ అంతా ఎదురుచూస్తున్నారు. అయితే చాలా సమావేశాల అనంతరం సోనియా గాంధీ ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. గాంధీ కుటుంబంలో వారు మాత్రమే కాకుండా..  ఎవ్వరైనా ఈ పదవిని చేపట్టవచ్చని తెలిపింది. దీనితో ఈ పదవికి మరింత ప్రాధాన్యత పెరిగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించిన ఎన్నిక ఈ రోజు అనగా అక్టోబర్ 17 న  జరగనుంది.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కేంద్రాన్ని ఎంపిక చేసుకుని ఎన్నికలు జరపడానికి కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ లో కర్నూల్ కేంద్రంగా ఈ ఎన్నిక జరగబోతోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 350 మంది పిసిసి సభ్యులు ఉన్నారు. వీరు తమ ఓటును కాబోయే పిసిసి ప్రెసిడెంట్ కు వేసే అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ ఓటును వినియోగించుకోవడంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా అవకాశం ఉంది. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నుండి పిసిసి డెలిగేట్ గా ఎంపికయ్యారు. దీనితో ఇవ్వాళ జరగనున్న ఈ ఎన్నికలు చిరంజీవి కర్నూల్ వెళతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారనుంది.

అయితే రాజకీయాలకు కొంచెం దూరంగానే ఉన్న చిరంజీవి ఇవాళ ఓటు వేస్తారా  అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ విషయంపైన అటు కాంగ్రెస్ పార్టీతో పాటు, జనసేన నాయకులు కూడా ఒక కన్ను వేశారు.  ఒకవేళ ఓటు వేస్తే కాంగ్రెస్ లో ఉన్నానని ప్రజలకు డైరెక్ట్ గా తెలియచేసినట్లే  అవుతుంది. ఇక ఈ మధ్య చిరంజీవి జనసెన లోకి వస్తారు అన్న మాటలకు అడుకట్ట పడ్డట్లే ..మరి ఏమి జరుగుతుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: