రాజకీయ వ్యూహకర్తగా దేశంలో పాపులరైన ప్రశాంత్ కిషోర్ (పీకే) బాగా గందరగోళంలో ఉన్నట్లు అర్ధమవుతోంది. వ్యూహకర్త హోదాలో తానుపనిచేసిన కొన్ని పార్టీలు అధికారంలోకి రావటంతో అదంతా తన ఘనతగానే పీకే అనుకుంటున్నట్లున్నారు. తాను కూయకపోతే ఊరికి తెల్లవారదని వెనకటికి ఒక కోడి అనుకున్నట్లుగా ఉంది పీకే వ్యవహారం. సరే ఇపుడీ విషయం అంతా ఎందుకంటే జన్ సురాజ్ యాత్రలో భాగంగా  పాట్నాలో మాట్లాడుతు జగన్, నితీష్ కుమార్ పదవీకాంక్షకు సాయపడ్డా అని వ్యాఖ్యలు చేశారట.





అలాగే బీజేపీ అనేది కేవలం నురుగులాంటిది మాత్రమే అని అసలైన కాఫీ ఆర్ఎస్ఎస్ మాత్రమే అని చెప్పారట. ఇలాగెందుకు చెబుతున్నామంటే పీకే ఒకర్ధంలో  మాట్లాడితే ఎల్లోమీడియా మరో అర్ధంలో బ్యానర్ కథనంగా అచ్చేసింది. పీకే చెప్పిందేమంటే బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది తప్ప మరో పార్టీవల్ల కాదని. ఇది పీకే చెప్పాల్సిన అవసరంలేదు దేశంలో రాజకీయాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు.





సరే ఇక అసలు విషయానికి వస్తే తానుకష్టపడి ఎవరినో గెలిపించేబదులు అదేదో తానే పార్టీ పెట్టేసి తన పార్టీని గెలిపించుకుని తానే సీఎం అయిపోదామని అనుకున్నట్లున్నారు. ఇక్కడే పీకే ఆలోచనల్లో తేడా కనిపిస్తున్నది. రాజకీయ నేత వేరు వ్యూహకర్త వేరు. రాజకీయ నేతన్నవాడు 24 గంటలూ జనాలమధ్యలోనే ఉంటాడు. కానీ వ్యూహకర్తకు డైరెక్టుగా ప్రజలతో సంబంధం అవసరంలేదు. వ్యూహకర్త హోదాలో రాజకీయపార్టీలకు పనిచేయటం, ప్రముఖులతో సన్నిహితంగా ఉండటం వల్ల ఆ వాసనలు పీకేకి బాగా ఎక్కేసినట్లున్నాయి.





అందుకనే తానూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేస్తున్నాడు. ఇఫుడు జన్ సురాజ్ పేరుతో పాదయాత్రని చెప్పినా తొందరలోనే పార్టీపెట్టి బీహార్ఎన్నికల్లో పోటీచేయబోతున్నాడు.  పీకే జాతకం తెలీదుకానీ లాజికల్ గా  అప్పుడు కానీ జనాల ఆలోచనలేంటో పీకేకి అర్ధంకాదు. ఈలోపు నోటికొచ్చిందేదో మాట్లాడేస్తు జనాలను అయోమయంలో పడేస్తున్నాడు. జగన్, మమతాబెనర్జీ, నితీష్, స్టాలిన్ కన్నా తాను ఎందులో తక్కువ అన్న ఆలోచనకు పీకే వచ్చినట్లున్నాడు. ఇదే ఇతనిలో అసలైన సమస్యగా అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: