ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వర్గాలలో ఒక విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీని ప్రజల్లో క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి బహిరంగ సభలను సాధనంగా ఎంచుకున్నాడు. అందులో భాగంగా ఈ మధ్యనే రెండు సభలు పూర్తి అయ్యాయి. అందులో ఒకటి ప్రకాశం జిల్లా కందుకూరులో ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద స్థాయిలో తరలివచ్చారు. అంత సవ్యంగా సాగుతుంది అనుకున్న సమయంలో అనుకోకుండా జరిగిన తొక్కిసలాట కారణంగా 8 మంది మృతి చెందగా, మరి కొంతమంది గాయాలు పాలు అయ్యారు. ఈ సభ జరిగిన ప్రదేశం అంతగా పెద్ద సభలకు అనువైనది కానిదిగా తెలుస్తోంది.

అందుకే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని కొందరు తమ అభిప్రాయాలను తెలియచేశారు. అయితే ఈ సంఘటనను మరువకముందే గుంటూరు సభలో మరో ఘోరం జరగడం రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యేలా చేసింది. ఈ సభలో మరో ముగ్గురు మహిళలు తమ ప్రాణాలను కోల్పోయారు. దేనితో విషయం పెద్దదైంది, చంద్రబాబు  సభకు వెళ్తే మృత్యు కోరల్లో చిక్కుకున్నట్టే అని అధికార పార్టీ విమర్శలు చేయడం స్టార్ట్ చేసింది. ఇక ప్రజలు మరియు సీనియర్ రాజకీయ ప్రముఖులు అంత ఇరుకైన రోడ్ లలో సభలు నిర్వహించడానికి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చిందని అనడంతో ప్రభుత్వం జీవో 1 ను తీసుకువచ్చి... ఇకపై ఏ సభ నిర్వహించాలన్న ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని... ఆ ప్రదేశం అన్ని విధాలుగా ఓకే అయితేనే ప్రభుత్వం అనుమతి ఇస్తుందని దాని సారాంశం.

ఈ జీవో పై ప్రభుత్వ వ్యతిరేక నాయకులు మరియు పార్టీలు వ్యతిరేకంగా గళం విప్పారు. కానీ జనసేనలో పనిచేసిన మాజీ సిబిఐ జెడ్ లక్ష్మీనారాయణ మాత్రం జగన్ తీసుకువచ్చిన కొత్త జీవో ను సమర్ధించారు. లక్ష్మీనారాయణ పార్టీ మరియు వ్యక్తితో సంబంధం లేకుండా మంచి చేస్తే ఎవరినైనా సమర్ధించే మనిషి. అందుకే కొత్త జీప్ పట్ల సానుకూలంగా మాట్లాడారు. కానీ ఈ వ్యాఖ్యలపట్ల టీడీపీ, జనసేన లు షాక్ అవుతున్నాయి.      




 

 



   

మరింత సమాచారం తెలుసుకోండి: