ఇంతకాలం అంతంత మాత్రంగా వైసీపీ-ఎల్లోమీడియా మధ్య ఉన్న యుద్ధం ఇపుడు తీవ్రరూపం దాల్చిందా ? ఎల్లోమీడియా బరితెగింపుతో యుద్ధం రోడ్డున పడిందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డంటే చంద్రబాబునాయుడుకు బద్ధవిరోధమన్న విషయం ప్రపంచానికంతా తెలిసిందే. చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన కారణంగా ఎల్లోమీడియా కూడా జగన్ పై వ్యతిరేకత పెంచుకున్నది. అందుకనే చంద్రబాబు, ఎల్లోమీడియా ఒకవైపు జగన్ సైన్యం మరోవైపు మోహరించాయి.





తామెంత వ్యతిరేక వార్తలు రాసిన జగన్ పట్టించుకోలేదన్న కసి ఎల్లోమీడియాలో పెరిగిపోయింది. అలాగే తనకు మద్దతిచ్చే మీడియా ఎన్ని వార్తలు, కథనాలు రాస్తున్నా జగన్ లెక్కచేయటంలేదనే కసి చంద్రబాబులో కూడా పెరిగిపోయింది. దీని ఫలితమే ఎల్లోమీడియాలో జగన్ పై తప్పుడురాతలు. గన్నవరంలో పట్టాభిని కొట్టారంటు తప్పుడు ఫొటోలు వేయటం ఇందులో భాగమే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తప్పుడు వార్తనేమో ఈనాడు దినపత్రిక మొదటిపేజీలో బ్యానర్ కథనంగా అచ్చేసి తప్పయిపోయిందనే సవరణను లోపల పేజీలో చిన్నదిగా అచ్చేశారు.





దాంతో మంత్రులు, మాజీమంత్రులకు మండిపోయింది. ఇదే విషయమై కొడాలి నాని మాట్లాడుతు ఈనాడు దినపత్రికను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. దాంతో పార్టీ నేతలంతా లైనుగా తీసుకుని చాలా నియోజకవర్గాల్లో దినపత్రిక కాపీలను రోడ్లపైన తగలబెడుతున్నారు. రైల్వేకోడూరు, శ్రీకాళహస్తి, అనంతపురం, పులివెందుల్లాంటి 15 నియోజకవర్గాల్లో ఈనాడు పత్రికలను వైసీపీ నేతలు, కార్యకర్తలు తగలబెట్టారు. నిజంగా ఇలాంటి ఘటనలు దురదృష్టకరమనే చెప్పాలి.





మీడియా మీడియాలాగ ఉండకుండా పార్టీని భుజనేసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. చంద్రబాబును భుజనేసుకుంటే ఎవరికీ ఎలాంటి నష్టమూలేదు. అలాగే అవకాశం దొరికినపుడు జగన్ పై వ్యతిరేకంగా రాసినా ఇబ్బంది ఉండదు. కానీ జగన్ పై గుడ్డివ్యతిరేకతతో జరగనిది జరిగినట్లు, లేనిది ఉన్నట్లు రాసి జనాలను తప్పుదోవ పట్టించాలని లేదా జగన్ పై తమ కసిని తీర్చుకోవాలని ఎల్లోమీడియా చూడటమే ఆశ్చర్యం.  ఎల్లోమీడియా అన్నీ హద్దులను దాటేసిన  ఫలితమే ఇపుడు బహిరంగంగా దినపత్రికలను తగలబెట్టేంత స్ధాయికి చేరుకోవటం. మరీ వ్యవహారం ఎంతదాకా వెళుతుందో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: