ప్రపంచంలో రోజుకో వింత ఘటన చూస్తుంటాము. సాధారణంగా ఒక్క బిడ్డకు ఆకలి వేస్తుందంటే మరో తల్లి పాలు ఇస్తుంది. ఎందుకంటే ఆ తల్లికి బిడ్డ ఆకలి తీర్చడమే ముఖ్యం. అలాగే ఆకలితో ఉన్న ఓ లేగ దూడను అక్కున చేర్చుకొని తన చనుపాలు పట్టి ఓ శునకం ఆ లేగ దూడ ఆకలి తీర్చుతోంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో చోటు చేసుకుంది.