నేటి సమాజంలో మానవతా విలువలు మంట గలిసిపోతున్నాయి. కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి కీచకుడిగా మారాడు. కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాదిపాటు పలుమార్లు రేప్ చేసి.. ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. తల్లి సాయంతో బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.