3 రాజధానుల వ్యవహారంలో ఎటువంటి తీర్పు వెలువడినా.. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పరిపాలన అందించాలన్నది పూర్తిగా ఆయనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. జగన్ కూడా తన ఇష్టానుసారం ఏ జిల్లా నుంచైనా పాలన అందించవచ్చు. పరిపాలన విషయంలో ఎవరి జోక్యాలు ఉండవని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగం కల్పిస్తున్న ఈ హక్కును సద్వినియోగం చేసుకొని జగన్ విశాఖ నుంచి పాలించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారని సమాచారం.