బ్రిజేష్ చౌదరి అనే ఒక ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో లో ఇద్దరు సింగర్స్ 2 నిమిషాల 20 సెకనుల పాటు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో మధురమైన సంగీతం సృష్టిస్తూ తమ గానామృతంతో శివుడి పాట పడుతూ శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశారు. ఐతే వీరి టాలెంట్ కి ప్రధాని నరేంద్ర మోడీ కూడా మంత్రముగ్ధులయ్యారు. అందుకే బ్రిజేష్ చౌదరి ట్వీట్ ని రీ ట్వీట్ చేసి బహుత్ బడియా( చాలా బాగుంది ) అని వాళ్ళిద్దరినీ ప్రశంసించారు. దీంతో వారి టాలెంటు లక్షల మందికి చేరువయ్యింది.