సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న కారణాలకే మానవత్వం మర్చిపోయి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి అడుగుతున్నాడని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కిరాతకంగా హత్య చేశారు. మొదట కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత చనిపోలేదని భావించి కత్తులతో గొంతుకోశారు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో చోటు చేసుకుంది.