ఇటీవల యూరోపియన్ సొసైటీ చేసిన అధ్యయనంలో 165 మంది పార్టిసిపేంట్లు పాల్గొనగా.. వారిని 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అనంతరం 60 మెట్ల భవనం ఎక్కాలని చెప్పారు. అయితే ఎవరైతే 40 నుంచి 45 సెకండ్ల లోపు 60 మెట్లను ఎక్కాగలిగారో.. వారిలో మరణించే రేటు చాలా తక్కువగా ఉందని కనుగొన్నారు. ఎవరైతే 90 సెకండ్ల కంటే ఎక్కువ సమయం తీసుకున్నారో వారు హృదయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారని కనుగొన్నారు.