ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా తాజా కేసుల సంఖ్య పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వీటిలో మహారాష్ట్ర కూడా ఒకటి. గతేడాది కరోనా తొలిదశలో అల్లాడిన మహారాష్ట్ర ఆ తర్వాత వైరస్ బారి నుంచి కోలుకుంటూ వచ్చింది.