రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ తో పాటు రైతులు కూడా బాగానే అప్డేట్ అవుతున్నారు. పాత పంథా లను  వదిలేసి కొత్త స్టైల్ పాటిస్తున్నారు వ్యవసాయం చేసే రైతులు. చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తూ పంటలకు రక్షణ కల్పిస్తున్నారు. ఇక ఈ రైతులకు క్రియేటివిటీని చూసి అందరు  ముచ్చట పడుతున్నారు. అయితే మామూలుగా పంటలకు పక్షులు బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి గురించి పంటకు రక్షణ కల్పించేందుకు రైతులు నానా తంటాలు పడుతుంటారు. ఎన్ని ప్రయోగాలు చేసిన పక్షులు మాత్రం పంటను నాశనం చేస్తూనే  ఉంటాయి. కానీ ఇక్కడ కరీంనగర్ రైతు మాత్రం వినూత్నంగా ఆలోచించి తన పంటను రక్షించుకున్నారు. ఇంతకీ ఈ రైతు ఏం చేశాడు అనుకుంటున్నారు. తన పంట కి పక్షుల నుంచి బెడద ఏర్పడడంతో అన్ని ఉపాయాలను ప్రయత్నించిన రైతు వినూత్నంగా ఆలోచించి ముమైత్ ఖాన్ పోస్టర్ ను  పొలంలో ఏర్పాటు చేశాడు. అది కూడా మామూలుగా ఉన్న పోస్టర్ కాదండోయ్   హాట్ లుక్ తో  చెమటలు పట్టించేలా  ఉన్న ముమైత్ ఖాన్ పోస్టర్ ను  పొలంలో ఏర్పాటు చేశాడు. 

 

 

 

 ఇక అంతే ఆ రైతు పంటకి ముమైత్ ఖాన్ రక్షణ గా మారిపోయింది. ముమైత్ ఖాన్ మొత్తం పంట లోకి వచ్చే పక్షులని తరిమి కొడుతుంది. అయితే ఆ రైతు పంటను నాశనం చేయడానికి వచ్చిన పక్షులు పొలం లో ఏర్పాటుచేసిన హాట్ ముమైత్ ఖాన్ పోస్టర్ చూసి దిమ్మతిరిగిపోయి  పంటను నాశనం చేయకుండానే వెళ్ళిపోతున్నాయి . అయితే ఈ రైతు పోస్టులు పెట్టి సైలెంట్ గా ఊరుకోలేదు ముమ్మైత్  ఖాన్ పాటలన్నిటినీ ప్లే చేయడం మొదలుపెట్టారు. దీంతో తన పంట లోనే కాదు అటు చుట్టుపక్కల పరిసరాలలో కూడా ఒక పక్షి కూడా కనిపించడం లేదు. అయితే ఈ ఐడియా ఏదో బాగుంది అనుకున్న మిగతా రైతులు కూడా ఇదే ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. ఇక ఈ పోస్టర్లు  చూసిన పలువురు ముమైత్ ఖాన్ హాట్ అందాలు యువతకు చమటలు పట్టించటమే  కాదు పంటలను కూడా కాపాడతున్నాయి  అని అనుకుంటున్నారు. 

 

 

 

 అయితే పొలాల్లో హీరోయిన్ల ఫోటోలు పెట్టే ట్రెండ్ మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ నుంచి మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన చెన్నారెడ్డి అనే రైతు తన పంటకు  వచ్చిపోయే వాళ్ళ  దిష్టి తగులుతుందని తన పంట పొలాల్లో సన్నిలియోన్ పోస్టర్ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో కూడా సంగారెడ్డి జిల్లా కొండారెడ్డి మండలంలో అన్వర్  అనే రైతు తన పంట పొలాలకు దిష్టి  తగులుతుందని భావించి తన అభిమాన హీరోయిన్ కాజల్ అగర్వాల్ పోస్టర్లను  పంట పొలంలో ఏర్పాటు చేశారు. వచ్చి పోయే వాళ్ళు మొత్తం కాజల్ పోస్టర్ ని చూస్తారు కాబట్టి తన పంటకు   ఎలాంటి దిష్టి తగలకుండా ఉంటుందని aa రైతు  తెలిపాడు. ఇప్పుడు ముమైత్ ఖాన్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: