గత రెండు రోజులుగా దీక్ష చేపట్టిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి,  జేఏసీ నేత రాజిరెడ్డి దీక్ష విరమించారు. వైద్యుల సూచన మేరకు విపక్ష నేతలు ఆర్టీసీ జేఏసీ  కార్మికులు అశ్వత్థామరెడ్డి రాజిరెడ్డి లను   దీక్ష విరమింపజేశారు. దీక్ష విరమించిన అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా... రేపు చేయతలపెట్టిన సడక్ బంద్ ను  వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఆర్టీసీ జేఏసీ నేతల  సమావేశంలో రేపు సాయంత్రం తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే హైకోర్టు తీర్పు ఇంకా కాఫీ తమకు అందలేదని ఆ తీర్పుపై ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చించి తుది నిర్ణయం వెల్లడిస్తానని ప్రకటిస్తామన్నారు  ఆయన. 



 అయితే హైకోర్టు నేడు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పై జరిగిన విచారణలో భాగంగా ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని తాము  చెప్పలేనని హైకోర్టు తెలిపింది. ఆర్టీసీ సమ్మెను లేబర్ కోర్టుకు రిఫర్ చేయాలంటూ ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరైతే చక్కటి ప్రశాంత వాతావరణాన్ని వారికి కల్పించాలంటూ సూచించింది  హైకోర్టు. అయితే తాజాగా దీనిపై స్పందించిన అశ్వత్థామరెడ్డి కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని ప్రభుత్వం యాజమాన్యం కార్మికుల మధ్య ఉన్న సంబంధాలను ప్రశాంత వాతావరణంలో పరిష్కరించుకునేందుకు ప్రస్తుతం సడక్ బంద్ ను  వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే సడక్ బంద్ ను వాయిదా వేస్తున్నాం కానీ ఆర్టీసీ డిపోల వద్ద కార్మికులు మాత్రం నిరసనలు జరుపుతారని స్పష్టం చేశారు. అయితే రేపు యూనియన్ల కమిటీ మీటింగ్ నిర్వహించి అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తుది నిర్ణయం వెల్లడి  చేస్తామంటూ అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. 



 అయితే హైకోర్టులో ఆర్టీసీ సమ్మె పై న్యాయం జరుగుతుందని భావించిన ఆర్టీసీ జేఏసీ నేతలు హైకోర్టు ఆర్టీసీ సమ్మె సమస్యను  లేబర్ కోర్టు లో తేల్చుకోవాలని చెప్పడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సడక్ బంద్ను వాయిదా వేసినట్లు సమాచారం. అంతేకాకుండా హైకోర్టులో తమకు న్యాయం జరగకపోవడంతో రేపు సాయంత్రం లోపు ఆర్టీసి జెఎసి నేతలు సమ్మెను విరమించే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేపు ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం నిర్వహించి ఎలాంటి కీలక  నిర్ణయం తీసుకోబోతున్నారు అనే విషయం మాత్రం తెలంగాణవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. 



 అయితే ఇప్పటికే కెసిఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం విషయంలో సానుకూలంగా లేరు.  ఆర్టీసీ ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతున్నారు. కార్మికులు కూడా సమ్మె 45 రోజుకు చేరుకోవడంతో సమ్మె భవితవ్యమేమిటో  ప్రశ్నార్థకం గా మారిపోయిందని ఆందోళన చెందుతున్నారు. ఎంతో  మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమ్మే విరమించే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. నిజంగానే ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెను విరమించుకోనున్నారా  లేక యథాతథంగా కొనసాగిస్తూ డిమాండ్లు  పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనస్తారా  అన్నది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: