రోజురోజుకు సమాజంలో వివాహేతర సంబంధాలు  పెరిగిపోతున్నాయి . భార్య వేరే వ్యక్తితో... భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఒకరినొకరు మోసం  చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకోకటి  తెర మీదకు వస్తున్నాయి. వివాహేతర సంబంధాల నేపథ్యంలో కొంత మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. తమ  తమ  భర్త భార్య వేరేవారితో సంబంధం పెట్టుకున్నారు అని తెలిసి అవాక్కవుతున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. భర్త విదేశాల్లో ఉన్నాడని...  భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని రాసలీలలు సాధిస్తుంది. ఇది తెలిసిన భర్త భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అనుకున్నాడు. విదేశాల నుంచి వచ్చి  అర్ధరాత్రి తలుపు కొట్టి చూడగా... అక్కడ మరో దృశ్యం చూసి భర్త షాక్ కి గురయ్యారు. హైదరాబాద్ లో ఘటన జరిగింది.అక్కడ  జరిగిన ఘటన చూసి పోలీసులు కూడా షాక్ కి గురయ్యారు. 

 

 

 

 వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా నడుగూడెనికి చెందిన వ్యక్తికి అదే జిల్లాకు చెందిన ఓ మహిళతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే హైదరాబాద్ వచ్చి కొత్తపేటలోని వాసవి  కాలనీలో సొంత ఫ్లాట్ తీసుకొని కాపురం పెట్టారు ఈ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇంజనీరింగ్  పూర్తి చేసిన భర్త ఎమ్మెస్ చదివేందుకు ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్ళాడు . అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చే వెళ్తుండేవాడు భర్త. భర్త భార్యకు దూరంగా ఉండడంతో... చిన్ననాటి స్నేహితుడైన శివ ప్రసాద్ అనే వైద్యుడు క్లోజ్ అయింది భార్య . తర్వాత ఆ క్లోజ్ నెస్ కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే ఈ విషయం భర్త వరకు చేరడంతో.. ఫోన్ చేసి ఇలా చేయడం తగదని భార్యను  హెచ్చరించారు భర్త  . అయినప్పటికీ భార్య ప్రవర్తనలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో...ఎలాగైనా  తన భార్యను రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకునేందుకు ప్లాన్ వేసాడు. భార్యకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే 20 రోజుల క్రితం విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. భార్యపై నిఘా పెట్టాడు . ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకునేందుకు సమయం కోసం వేచి చూసాడు ఆ భర్త . ఇక ఓ  రోజు రాత్రి భార్య తన స్నేహితుడు శివప్రసాద్ తో  కలిసి ఇంట్లో రాసలీలలు నడిపిస్తుండగా తలుపు కొట్టాడు. 

 

 

 

 రాత్రి ఎవరు తలుపు  కొడుతున్నారో అని  భయపడుతూనే వెళ్లి తలుపు తెరిచిన భార్య భర్తను చూసి షాక్ కు గురైంది. అక్కడే తన భార్య తో ఉన్న శివప్రసాద్ ను ఇక్కడ ఎందుకు ఉన్నావు అంటూ భర్త ప్రశ్నించారు. కానీ తాను  ఎప్పుడైనా వస్తానని ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను అంటూ బెదిరించాడు  శివ ప్రసాద్ .కొంత  సమయం పాటు వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ ఇంటికి చేరుకునే ముందే పోలీసులకు సమాచారం అందించడంతో అదే సమయానికి అక్కడికి పోలీసులు చేరుకున్నారు.  బాధితుది  భార్య ను ఆమె స్నేహితుడు శివప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఇంతలోనే మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మరో గదిలో బాధితుడి భార్య స్నేహితుడైన నరేష్, మరో మహిళా పట్టుబడ్డారు. వీరిద్దరు కూడా దంపతులు కాదని వీరు  కూడా వివాహేతర సంబంధం నడుపుతున్నారని నిర్దారించిన పోలీసులు  అందరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అందరిపై వివిధ  సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: