సమైక్యవాదులంతా షాక్ కు గురయ్యారు, ఏ సమావేశం లో నయితే తెలంగాణ బిల్లుకు చరమగీతం పాడొచ్చు అనుకున్నారో అదే బిఏసి సమావేశం తెలంగాణపై అసెంబ్లీలో చర్చ జరపాల్సిందేనని డిసైడ్ చేసింది. అంతే కాదు ఇప్పుడు చర్చ కోసం రెండు మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలను పొగడించాలని డిసైడ్ చేసారు. అంతే కాదు మిగిలిన చర్చకోసం తిరిగి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఎవరైతే తెలంగాణను అడ్డకుంటారని భావించారో ఆ ముఖ్యమంత్రే తెలంగాణపై చర్చ చేపట్టాలని పేర్కొనడంతో సమైక్యవాదులు షాక్ కు గురయ్యారు.
ఈ నిర్ణయం మేరకు ఈ నెల 23 వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. దీనిని సీమాంద్ర టిడిపి, వైకాపా ఎమ్మెల్యేలు తిరస్కరించగా మిగతావారు ఆమోదించారు. ముసాయిదాపై చర్చించాలనే నిర్ణయించడంతో ఇక సభలో తెలంగాణ బిల్లు చర్చకు వస్తుందా రాదా అనేదానిపై తెరపడింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి గంటన్నర ఆలస్యంగా రావడం విశేషం. వచ్చి రాగానే కేంద్రం నిర్ణయం తీసుకున్నందున జాప్యం చేయడం సబబు కాదు చర్చ జరుపుదాం అనడం విశేషం. 23 వరకు చర్చ జరిగిన తర్వాత తెలంగాణ బిల్లుపై తర్వాత సభ నిర్వహించి మళ్లీ చర్చించాలని నిర్ణయించారు. జనవరి రెండు నుంచి సంక్రాంతి సెలవుల వరకు, అనంతరం 18 నుంచి 23 వరకు నిర్వహించి అసెంబ్లీ అభిప్రాయాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం.
దీంతో హతాషులైన సీమాంద్ర టిడిపి, వైకాపా ఏంచేయాలో తోచక బిఏసి సభనుంచి వాకౌట్ చేసాయి. బిఏసి సమావేశం నుంచి తెలుగుదేశం నేత గాలి ముద్దుమకృష్ణమ నాయుడు , వైకాప ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు. అసెంబ్లీలో తీర్మాణం జరిగాకే చర్చ జరగాలని ఆయన పట్టుపట్టారు. దీనిని బిఏసి తిరస్కరించింది, దీంతో ఆయన సమావేశం నుంచి వాకౌట్ చేసారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రాన్ని విడగొట్టినా అసెంబ్లీ తీర్మాణం తర్వాతే బిల్లు వచ్చిందన్నారు. స్పీకర్ తన ఇష్టాను సారం చేస్తున్నారని ఆయన చెప్పారు.
అంతే కాదు వైకాపా సీమాంధ్ర ఎమ్మెల్యేలు వాకౌట్ చేసారు. ఇప్పటి వరకు రాష్ట్రాల విభజనలో పాటిస్తున్న సంప్రదాయాలను ఇప్పుడు పాటించడం లేదు. సమైక్య తీర్మాణం చేయాలంటే ఒప్పుకోలేదు అని విజయమ్మ చెప్పారు. ఇప్పుడు చర్చ జరిపి తర్వాత కంటిన్యూ చేద్దామన్నారు. ముఖ్యమంత్రి సమైక్యంగా ఉంచుతాను అని చెప్పి మాట తప్పారు. మాకు బిల్లులో ఉన్నవి చదివి తెలుసుకోవడానికి సమయం అడిగాం, కాని ఇవ్వమన్నారు. అంతే కాదు సభను నడవనివ్వం, అడ్డుకుంటాం అని విజయమ్మ చెప్పారు. ఇక రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతుందా, సీమాంద్ర టిడిపి, వైకాపాల ఆందోలనతో వరుసగా వాయిదా పడతాయా అన్నది ఉత్కంఠ గా మారింది.
మరింత సమాచారం తెలుసుకోండి: