తెలంగాణాలో కమ్యూనిస్టులు కొత్త మిత్రులను వెతుక్కునే పనిలో పడ్డారు. party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ ఇప్పటికే ఇలాంటి ప్రయత్నం  చేసింది.  తాజాగా సీపీఎం కూడా కేసీఆర్ తో కలిసి పనిచేయటానికి స్నేహ హస్తం చాస్తోంది. కేసీఆర్ తో కయ్యానికి పోవటం కంటే వియ్యానికి వెళ్లటమే బెటర్ అనుకుందో... లేదంటే కలిసి వచ్చే అంశాలతోనయినా కలుపుకుని పనిచేస్తే బెటర్ అనుకుంటున్నారో కానీ కామ్రేడ్స్ మాత్రం కేసీఆర్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. 

 

తెలంగాణలో కమ్యూనిస్టులు రోజు రోజుకు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముందస్తు ఎన్నికల్లో కనీసం శాసన సభల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ, సీపీఎం పార్టీలు కనీసం చెరో సభ్యుడయినా అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహించే వారు. కానీ ఈ సారి అదికూడా లేకుండా పోయింది. ఇన్నాళ్లు కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన సీపీఐ... ఆ పార్టీకి దూరమైంది. ఇక సీపీఎం కాంగ్రెస్ తో కలిసి పనిచేసేదే లేదని తేల్చి చెప్పింది. 

 

ఇప్పుడు దేశ వ్యాప్తంగా  బీజేపీకి వ్యతిరేకంగా సీఏఏ బిల్లుకు వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఎంఐఎం, టీఆర్ఎస్ కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. దీన్నే ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు అదునుగా చేసుకుని అడుగులు ముందుకు వేయాలనుకుంటున్నాయి. సీఏఏ తో పాటు... కేంద్రం తెలంగాణ కు బడ్జెట్ లో అన్యాయం చేసింది... రాష్ట్రాలకు రావాల్సిన వాటాను కేంద్రం ఎగవేసిందనే అంశంపై కేసీఆర్ బాహటంగానే విమర్శిస్తున్నారు. ఈ రెండు అంశాలపై కేంద్రంపై ఉద్యమం చేసేందుకు తాము కూడా సిద్దంగా ఉన్నాం... మీరు ముందుండి నడిపించండి కలిసి రావాటానికి  తాముసిద్దంగా ఉన్నామంటూ సీపీఎం కేసీఆర్ ని కోరింది. ఇలా సీపీఎం పార్టీ తొలిసారిగా టీఆర్ఎస్ కి స్నేహ హస్తం అందించింది.

 

ఇక party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ పార్టీ కూడా ఇదే ఆలోచనలో ఉంది. బీజేపీకి వ్యతిరేకించి మాట్లాడుతున్న కేసీఆర్ ని కలుపుకుని పోవటమే బెటర్ అనుకుంది. సీఏఏ ని కేసీఆర్ కూడా వ్యతిరేకిస్తున్న క్రమంలో ఆయన్ని ముందుంచి ఉద్యమాలు చేయాలనే ఆలోచనతో party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ ఉంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనే కలిసి పనిచేయాలనుకున్నారు. కానీ.. అప్పట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంతో...  కలిసి పనిచేయాలని ప్రకటించి... కార్మిక సంఘాల ఒత్తిడితో వెనక్కి తగ్గింది. ఇప్పుడు సీఏఏ విషయంలో లెఫ్ట్ పార్టీలు మోడీకి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో... కేసీఆర్ ని ముందుంచే ఆలోచన చేస్తోంది.  సీపీఐ జాతీయ కార్యదర్శి^నారాయణ కూడా  కలిసి పనిచేద్దాం అని...సీఎం కేసీఆర్కి అప్పీల్ చేశారు. మొత్తం మీద.. కేసీఆర్ తో కలిసి పనిచేయటానికి  స్నేహ హస్తం అందిస్తున్నాయి కమ్యూనిస్టు పార్టీలు.  అయితే టీఆర్ఎస్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన కనిపించడంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: