కరోనా వైరస్  ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ ప్రాణభయంతో వనికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చైనా దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా వైరస్  ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది.ఇంకా  ఎంతోమందిని మృత్యువుతో పోరాటం చేసేలా  చేస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ప్రపంచ దేశాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 57 దేశాలకు ఈ ప్రాణాంతకమైన వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. అయితే మన భారతదేశంలో కూడా ఈ ప్రాణాంతకమైన వైరస్ వచ్చింది. ప్రాణాంతకమైన వైరస్ కు సంబంధించి ఏకంగా మూడు కరోనా  పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. 

 

 

 దీంతో ఒక్కసారిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయిపోయాయి. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా  అనుమానితులు కూడా ఉండటంతో మరింత జాగ్రత్త చేపట్టాయి  చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే తాజాగా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో కూడా కరోనా  పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడని.. అతనికి కరోనా  సోకినట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కంపెనీ పనిమీద ఫిబ్రవరి 15వ వెళ్లిన చైనా సమీప ప్రాంతానికి వెళ్లిన ఆ వ్యక్తి తిరిగి బెంగళూరుku అక్కడి నుంచి హైదరాబాద్ కు  వచ్చాడు  అంటూ ఇలా తెలిపారు. తీవ్రమైన జ్వరం రావడంతో పరీక్షలు చేసుకుని  మందులు వాడాడని  అయినప్పటికీ తగ్గకపోవడంతో గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకో గా కరోనా ఉన్నట్లు తేలింది అంటూ  మంత్రి తెలిపారు. 

 

 

 బెంగళూరు నుంచి ఆ వ్యక్తి హైదరాబాద్ వచ్చిన బస్సులో ఆ వ్యక్తితో పాటు చాలా మంది ప్రయాణికులు ఉన్నారు అంటూ మంత్రి ఈటల తెలిపారు. అంతేకాకుండా బాధితుడు తన కుటుంబంతో సహా కొన్ని రోజులు గడిపాడు అంటూ తెలిపిన మంత్రి ఈటల.. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు సహచర వివరాలు కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో దగ్గడం తుమ్మడం ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు మంత్రి ఈటల.

మరింత సమాచారం తెలుసుకోండి: